పొలిటికల్ గేమ్ లో ప్లేయర్లు

పొలిటికల్ గేమ్ లో ప్లేయర్లు

ఇప్పటికే కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌‌ రాథోడ్‌ .. షూటింగ్‌‌లోనే కాదు పరిపాలనలోనూ తాను నంబర్‌ వన్‌ అని  రూపించు కోగా… కీర్తి ఆజాద్‌, నవ్‌ జోత్‌ సింగ్‌‌ సిద్ధు వంటివారు క్రియాశీల రాజకీయాల్లో తమ మార్క్‌‌ చూపెట్టారు . ఇప్పుడు ఈ జాబితాలో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా చేరనున్నాడు. ఆటగాడిగానే దేశ భద్రత విషయంలో రాజీపడని వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఈ ఢిల్లీ ఓపెనర్‌ .. ఎంతో మంది అమర జవాన్ల పిల్లల చదువులకయ్యే ఖర్చు భరిస్తూ వస్తున్నాడు. తాజాగా బీజేపీ తరఫున రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు గంభీర్‌ గ్రౌండ్‌ రెడీ చేసుకుంటున్నాడు. స్పోర్ట్ స్‌ బ్యాక్‌‌గ్రౌండ్‌ నుంచి వచ్చి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన వారిని పరిశీలిస్తే… 16వ లోక్‌‌సభలోరాథోడ్‌ తో పాటు మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ కూడా

ఉన్నారు . బీహార్‌ లోని దర్భంగా నుంచి బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఆజాద్‌ ఆ తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీపై అవినీతి ఆరోపణలు చేసి పార్టీ నుం చి సస్పెండ్‌ అయ్యారు. ఈ మధ్యనే (ఫిబ్రవరి 18,2019) కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు . ఇండియా ఫుట్‌ బాల్‌‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ ప్రసూన్‌ బెనర్జీ కూడా తృణముల్‌‌ కాంగ్రెస్‌ తరఫున రెండో సారి లోక్‌‌సభకు ఎన్నికయ్యారు . జాతీయ స్థాయి షూటర్‌ కాలికేశ్‌ నారాయణ్‌ సింగ్‌‌ డియో ఒడిశాలోని బొలంగీర్‌ నియోజక వర్గం నుంచి బిజూ జనతాదళ్‌‌ (బీజేడీ) తరఫున బరిలో నిలిచారు . అంతకుముందు కాలికేశ్‌ తండ్రి అనంగ ఉదయ సింగ్‌‌, తాత రాజేంద్ర నారాయణ్‌ సింగ్‌‌ కూడా ఎన్నికల బరిలో నిలిచిన వారే.. అందులో రాజేంద్ర నారాయణ్‌ సింగ్‌‌ ఒడిశా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఒలిం పిక్ షూటర్‌ రాజ్యవర్ధన్‌ రాకతో దేశరాజకీయాల్లో కొత్త ఒరవడి మొదలైం ది. షూటర్‌ గా ప్రస్థానాన్ని ప్రారంభించిన రాథోడ్‌ ఆ తర్వా త ఆర్మీలో చేరి అద్భు త ప్రదర్శనలతో ఏథెన్స్‌ ఒలిం పిక్స్‌ (2004)లో రజత పతకం సాధించారు . ఆ తర్వా త ఉద్యోగానికి రాజీనామా చేసి పాలిటిక్స్‌ లో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే క్రీడల మంత్రి స్థాయికి ఎదిగారు. ఓ ప్లేయర్‌ గా తానెదుర్కొన్న ఇబ్బందులను గుర్తెరిగిన రాథోడ్‌ స్పోర్ట్స్‌ మినిస్టర్‌ గా ఎన్నికైన తర్వాత ప్రజల్లోకి దూసుకెళ్లిన విధానం అందరిని ఆశ్ఛర్యపరిచింది.

ఖేలో ఇండియా అభియాన్‌ ’, ‘పాం చ్‌ మినట్‌ ఔర్‌ ’‘ఫిట్‌ నెస్‌ చాలెం జ్‌ ’ వంటి వినూత్న ప్రయోగాలతో క్రీడలను యావత్‌ దేశానికి మరిం త చేరువ చేసే విధంగా ముందుకెళ్తున్నారు . టీమిండియా మాజీ కెప్టెన్‌ , హైదరాబాదీ బ్యాట్ స్‌ మన్‌ మహ్మద్‌ అజహరుద్దీ న్‌ 2009 లోక్‌‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున మురాదాబాద్‌ నుంచి గెలిచి.. 2014లో రాజస్థాన్‌ నుం చి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సుఖ్‌ బీర్‌ సింగ్‌‌ చేతిలో ఓటమి పాలయ్యారు. వీళ్లే కాక మరికొం త మంది స్పోర్ట్స్‌ పర్సన్స్‌ కూడా ఎలక్షన్స్‌ లో తమ అదృష్టాన్ని పరీక్షించు కున్నారు . వారిలో ఆసియా క్రీడల్లో రెండు గోల్డ్‌‌ మెడల్స్‌ సాధించిన  మిడిల్‌‌ డిస్టాన్ స్‌ రన్నర్‌ జ్యో తిర్మయి సిక్‌‌దార్‌ ఉన్నారు . 2004 ఎన్నికల్లో జ్యో తిర్మయి సీపీఐ (ఎమ్‌ ) తరఫున పశ్చిమ బెం గాల్‌‌లోని కృష్ణానగర్‌ నియోజక వర్గం నుం చి పోటీ చేసి గెలిచారు. అంతకుముందు ఒలిం పిక్‌‌ కాంస్య పతక విజేత, హాకీ స్టార్‌ ప్లేయర్‌ అస్లమ్‌ షేర్‌ ఖాన్‌ 1984 లోక్‌‌సభ ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వా త టీమిం డియా మాజీ ఓపెనర్‌ చేతన్‌ చౌహాన్‌ బీజేపీ తరఫున రెండు సార్లు (1991, 98) ఎంపీగా గెలుపొం దారు. ప్రస్తుతానికైతే క్రీయాశీల ఆటగాళ్లెవరూ రాజకీయ బరిలో లేరనే చెప్పాలి. 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో కీలక ఇన్నిం గ్స్‌ ఆడి జట్టు విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్ స్‌ మన్‌ గంభీర్‌ తన అదృష్టాన్ని పరీక్షించు కోనున్నాడు. టీమిండియా ఆల్‌‌రౌండర్‌ రవీం ద్ర జడేజా భార్య రీవా సోలంకి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకుం ది. గతంలో కర్ణి సేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా పనిచేసిన రీవా అప్పట్లో బాలీ వుడ్‌ చిత్రాలపై నిషేధం విషయంలో వార్తల్లో కెక్కింది.

2009 జనరల్‌‌ ఎలక్షన్స్‌ లో మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌‌ కాంగ్రెస్‌ తరఫున ఉత్తరప్రదేశ్‌ లోని ఫూల్‌‌పూర్‌ నియోజక వర్గం నుం చి పోటీ చేసి ఓటమి  పాలయ్యాడు. 2014 సాధారణ ఎన్నికల్లో ఇండియా ఫుట్‌ బాల్‌‌ మాజీ కెప్టెన్‌ బైచుంగ్‌‌ భూటియాకు ఓటమే ఎదురైంది. నేషనల్‌‌ మాజీ స్విమ్మింగ్‌‌ చాం పియన్‌ నఫీసా అలీ రెండు సార్లు (2004లో కాంగ్రెస్‌ నుంచి,2009లో సమాజ్‌ వాదీ పార్టీ నుం చి) లోక్‌‌సభకు పోటీ చేసినా ఆమెను విజయం వరించలేదు. ప్లేయర్లకు మోడీ పిలుపు మన దేశంలో క్రీడలపై ఉన్న ఆసక్తిని.. క్రీడాకారుల  పట్ల యువతలో ఉన్న క్రేజ్‌ ను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్‌‌ విడుదలైన అనంతరం ఓటు హక్కు వినియోగంలో విస్తృత ప్రచారం చేయాల్సిం దిగా పలువురు క్రీడా ప్రముఖులను కోరారు. ఈ జాబితాలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూ ల్కర్‌ , విరాట్‌ కోహ్లి, మహేంద్ర సింగ్‌‌ ధోనీ, రోహిత్‌ శర్మ, వీరేం ద్ర సెహ్వాగ్‌‌, రెజ్లింగ్‌‌ స్టార్‌ బజరంగ్‌‌ పునియా, వినేశ్‌ ఫోగట్‌ , పీవీ సింధు, సైనా నెహ్వాల్‌‌ తదితరులు ఉన్నారు . ఎన్నికల్లో పోటీ చేయకుం డానే…పార్లమెం ట్‌ ఎగువ సభకు ఇప్పటికే పలువురు క్రీడా ప్రముఖులు గౌరవ సభ్యులుగా ఎన్నికయ్యారు . ఆ జాబితాలో క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ రమేశ్‌ టెండూ ల్కర్‌ పేరు అగ్రస్థా నంలో ఉంటుం ది. 2012 నుం చి 18  వరకు రాజ్యసభ ఎంపీగా కొనసాగిన టెండూల్కర్‌  పెద్దగా క్రీయాశీలంగా పనిచేసిం ది లేదు. ఓ వైపు అంతర్జాతీయ కెరీర్‌ కొనసాగిస్తున్న సమయంలోనే పెద్దల సభకు ఎన్నికవడంతో ఎక్కువ చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా దక్కలేదు.