హైదరాబాద్, వెలుగు: శ్రీ వెంకటేశ్వర హోటల్స్ గ్రూప్ నూతన ప్రాజెక్ట్ ‘అరీనా ది లీగ్’ పేరుతో స్పోర్ట్స్ బార్, రెస్టారెంట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. దాదాపు 6.5 ఎకరాలలో ఏర్పాటు చేసిన అరేనాలో సాహస క్రీడలు, రుచికర వంటకాలు, డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి ఇవి ఎంతో ఉపయోగపడుతాయని కంపెనీ తెలిపింది.
ఇక్కడ క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ కోర్ట్‌లు, పికిల్‌బాల్, త్రోబాల్, రాపెల్లింగ్, సైక్లింగ్ ట్రాక్, ఇండోర్‌గేమ్స్ ఉంటాయి. ఫుట్‌బాల్, వాలీబాల్నూ ఆడుకోవచ్చని, ఇక్కడ 51 వేల -చదరపు అడుగుల్లో పచ్చిక మైదానం కూడా ఉందని వివరించింది. కచేరీలు, వివాహాలు, ఈవెంట్లకు ఇది సరైన వేదిక అని తెలిపింది. హడల్ పేరుతో 120-సీట్ల స్పోర్ట్స్ బార్ కిచెన్‌లో తెలంగాణ, ఆంధ్రా, కాంటినెంటల్ వంటకాలను ఆస్వాదించవచ్చని శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ హోటల్స్ భాగస్వామి ఆర్‌వి రాజ్‌గోపాల్ చెప్పారు.