
హనుమకొండ/ కేయూ క్యాంపస్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో స్పోర్ట్స్సందడి స్టార్ట్ అయ్యింది. సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఖోఖో విమెన్చాంపియన్షిప్పోటీలు యూనివర్సిటీ గ్రౌండ్లో గురువారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పాండిచ్చేరి నుంచి 67 టీమ్స్తరలివచ్చాయి. గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఆరు కోర్టుల్లో పోటీలు నిర్వహించారు. మొదటి రోజు ఉదయం 13, మధ్యాహ్నం 11 మ్యాచ్‌లు జరిగాయి. పోటీలను కాకతీయ యూనివర్సిటీ వైస్చాన్సలర్ప్రొఫెసర్తాటికొండ రమేశ్, వరంగల్ పోలీస్కమిషనర్డా. తరుణ్‌జోషి చీఫ్‌గెస్ట్‌గా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆటలో గెలుపు ఓటములు సహజమని, అందరూ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు.
మొదటి రోజు పోటీలు ఇలా..
మొదటి రోజు టోర్నమెంట్లో యూనివర్సిటీ ఆఫ్మద్రాస్, తమిళనాడు ఫిజికల్ఎడ్యుకేషన్యూనివర్సిటీతో తలపడగా.. మద్రాస్ యూనివర్సిటీ విజయం సాధించింది. శ్రీవేంకటేశ్వర(తిరుపతి)పై కువెంపు(కర్నాటక) యూనివర్సిటీ, డా.బీ.ఆర్అంబేద్కర్యూనివర్సిటీ(శ్రీకాకుళం)పై మధురై కామరాజు(మధురై), అవినాశలింగం యూనివర్సిటీ(కోయంబత్తూరు)పై తెలంగాణ యూనివర్సిటీ(నిజామాబాద్) గెలుపొందాయి. అనంతరం నిర్వహించిన పోటీల్లో కన్నూరు యూనివర్సిటీ, ఎంజీ యూనివర్సిటీ(కొట్టాయం), భారతీయర్(తమిళనాడు), అన్నామలై యూనివర్సిటీ(చిదంబరం), మంగళూరు యూనివర్సిటీ, దవంగరే(కర్నాటక), వీటీయూ బెల్గవి, ఆదికవి నన్నయ యూనివర్సిటీ(రాజమహేంద్రవరం), ఎంఎస్ యూ(తిరునాల్వెల్లి), తుమ్కూర్, ఓయూ, కేయూ విజయం సాధించాయి.
ఆడపిల్లలు ఎండలో.. ఆఫీసర్లు సన్మానాల్లో..
కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్లో ఉదయం 10 గంటలకు ఖోఖో పోటీల ప్రారంభ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కానీ కార్యక్రమం దాదాపు రెండు గంటలు ఆలస్యంగా 12.10 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఖోఖో పోటీల్లో పాల్గొన్న స్టూడెంట్లను చీఫ్గెస్ట్లు వచ్చేవరకు ఎండలోనే ఉంచారు. అతిథుల ప్రసంగం అయిపోయేవరకు వారిని అలాగే ఎండలో కూర్చోబెట్టారు. ఆలస్యంగా రావడం.. పిల్లల్ని ఎండలో కూర్చొబెట్టి ఆఫీసర్లు సన్మానాల్లో మునిగిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వివిధ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఆఫీసర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.