
రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ మంచి కార్యక్రమమే కానీ.. ఒకరికి మంచి చేయడానికి ఇంకొకరి కడుపు కొట్టొద్దని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని... రాష్ట్రంలోని 6 లక్షల మంది డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలిపారు. కానీ ఇప్పుడు రోడ్లపై బస్ లు కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నాయని విమర్శించారు.
ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 15వేల జీవనభృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని.. వారి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు.
సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేట్ సోసైటీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్ కు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో హరీష్ రావు పతంగులను ఎగురవేశారు. సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో అటల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికి ఆదర్శమని చెప్పారు. 1480 మంది ఆటో డ్రైవర్లు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారని... సిద్దిపేటకు వారు బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు. పట్టణానికి వచ్చే అతిథులను గౌరవమర్యాదలతో గమ్యాలకు చేరుస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు చెప్పారు.