కమలాపూర్, వెలుగు : మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా స్థాయి ఆటలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ఎంజేపీ బాయ్స్ గురుకులంలో నిర్వహించిన పోటీలను రీజినల్ కో ఆర్డినేటర్ వై.మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. అండర్ 14, అండర్ 19 విభాగాల్లో మూడు రోజుల పాటు జరగనున్న పోటీలకు మొత్తం 800 మంది స్టూడెంట్లు హాజరయ్యారు.
ALSO READ : కరీంనగర్ లో కృతిశెట్టి సందడి
ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ స్టూడెంట్లు చదువుతో పాటు, ఆటల్లోనూ రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంజేపీ గురుకులాల హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ సరిత, భూపాలపల్లి జిల్లా కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్స్ ఓదెల మల్లయ్య, ప్రపుల్లాదేవి, రేవతి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.