ప్రైవేట్ స్కూళ్లలో స్పోర్ట్స్ గ్రౌండ్ మస్ట్​

  • కేసీఆర్ హయాంలో క్రీడలు పూర్తిగా నిర్వీర్యం 
  • తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి

న్యూఢిల్లీ: ప్రైవేట్ స్కూళ్లలో స్పోర్ట్స్ గ్రౌండ్ కచ్చితంగా ఉండాలని, ఒకవేళ సొంతంగా లేకపోతే అద్దె మైదానం ఉండాలని నిబంధన పెడుతున్నామని తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ హయాంలో క్రీడలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. 

‘సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా క్రీడా ప్రేమికుడు, క్రీడాకారుడు. క్రీడలకు కనీవినీ ఎరుగని స్థాయిలో నిధులు కేటాయించారు. ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్, బ్యాడ్మింటన్ అంతర్జాతీయ క్రీడలు, హాకీ.. ఇలా అనేక స్టోర్ట్స్​నిర్వహిస్తున్నం. గ్రామీణ స్థాయి నుంచి ప్లేయర్లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నం. ఒలింపిక్స్ లో ఉన్న 38 రకాల క్రీడల్లో  శిక్షణ ఇస్తున్నం. హైదరాబాద్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నం. ఇందుకోసం ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ వెళ్లి అధ్యయనం కూడా చేసి వచ్చాం. కేంద్రంలో మన్సుఖ్ మండవియా, పీటీ ఉషను కలిసి నేషనల్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించాలని కోరాం. పాఠశాలల్లో స్పోర్ట్స్ ఫ్యాకల్టీ ఉండేలా చూస్తాం. పీఈటీ ఖాళీలు భర్తీ చేస్తం’ అని తెలిపారు.