పోటీతత్వాన్ని పెంచేందుకు క్రీడలు దోహదం

  • కేటీపీఎస్ చీఫ్ ఇంజినీర్లు పీవీ రావు, ప్రభాకర్ రావు 
  • పాల్వంచలో టీఎస్ జెన్​కో ఇంటర్ ప్రాజెక్టు క్రీడలు ప్రారంభం 

పాల్వంచ, వెలుగు : టీఎస్ జెన్​కో ఇంటర్ ప్రాజెక్టు పరిధిలో నిర్వహిస్తున్న క్రీడలు కార్మి కుల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు దోహదపడుతున్నాయని తెలంగాణ కేటీపీఎస్ 5 ,6 దశల చీఫ్ ఇంజినీర్ మేక ప్రభాకర్ రావు,7వ దశ చీఫ్ ఇంజినీర్ పి.వెంకటేశ్వర రావు అన్నారు. తెలంగాణ జెన్​కో పరిధిలో ఇంటర్ ప్రాజెక్ట్ ఫుట్ బాల్, బ్యాడ్మింటన్ పోటీలను మంగళవారం పాల్వంచలోని విద్యుత్​ కళాభారతి, సెంట్రల్ ఆఫీస్ క్రీడా ప్రాంగణాల్లో ఘనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు ప్రశాంత వాతావరణంలో పోటీతత్వంతో క్రీడల్లో పాల్గొనాలన్నారు. మూడు రోజులు పాటు నిర్వహించే ఈ క్రీడలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీఎస్ జెన్​కో స్పోర్ట్స్ ఆఫీసర్ లోహితా నంద్ అధ్యక్షతన కేటీపీఎస్ 7వ దశ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.  కార్యక్రమంలో కేటీపీఎస్, బీటీపీఎస్ స్పోర్ట్స్ సెక్రటరీలు వై.వెంకటేశ్వర్లు, వీరస్వామి, కల్తి నరసింహారావు పాల్గొన్నారు.