ఆర్మూర్, వెలుగు : ఈఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ గవర్నమెంట్జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్కు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. శుక్రవారం కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో ఈఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజ శేఖర్ రూ.20వేలు విలువైన స్పోర్ట్స్కిట్స్ను అందజేశారు.
ఉన్నత చదువులకు ముందుకు వచ్చే స్టూడెంట్స్కు తనవంతు సహకారం అందిస్తానని ఆయన చెప్పారు. సొసైటీ సభ్యులు అర్గుల్ సురేశ్, గంగ మోహన్, నరేందర్ నాయక్, ఇస్తకొద్దీన్, గంగారెడ్డి, మహిపాల్ రెడ్డి, శేఖర్, శ్రీకాంత్, ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి, లెక్చరర్స్ పాల్గొన్నారు.