అథ్లెట్లను తక్కువ చేస్తే సహించేది లేదు.. స్పోర్ట్స్ మినిస్టర్ మాండవీయ వార్నింగ్

అథ్లెట్లను తక్కువ చేస్తే సహించేది లేదు.. స్పోర్ట్స్ మినిస్టర్ మాండవీయ వార్నింగ్

న్యూఢిల్లీ: వివాదాలు, అంతర్గత విభేదాలకు కేంద్ర బిందువులుగా మారిన నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ వార్నింగ్ ఇచ్చారు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వర్గపోరును, బంధుప్రీతిని తక్షణం పక్కనపెట్టాలన్నారు. ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆతిథ్యం ఇవ్వాలని ఇండియా కృత నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో 2036  మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సక్సెస్ చేయాలంటే అథ్లెట్లే కేంద్ర బిందువుగా ఉండే విధానాన్ని అనుసరించాల్సిందేనని తేల్చి చెప్పారు. 

అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన డిజీ లాకర్ సర్టిఫికెట్ ప్రారంభం సందర్భంగా గురువారం 40 నేషనల్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్ల ప్రతినిధుల సమక్షంలో మాండవీయ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఆథ్లెట్లను తక్కువ చేయడాన్ని మాత్రం అస్సలు  సహించను. మీ వర్గ పోరు వల్ల నష్టపోయేది ఆటగాళ్లే. ఇకపై అలాంటి దానికి తావుండదు. 

క్రీడా సమాఖ్యలు బాధ్యతగా వ్యవహరించాలి’ అని స్పష్టం చేశారు. బాక్సింగ్, రెజ్లింగ్, ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్, ఈక్వెస్ట్రియన్ వంటి క్రీడా సమాఖ్యల్లో వర్గ పోరు, కోర్టు కేసుల నేపథ్యంలో మాండవీయ ఈ హెచ్చరిక చేశారు. ‘మీకు మినిస్ట్రీ నుంచి కావలసిన మౌలిక వసతులు, ఆర్థిక సాయం అన్నీ ఉంటాయి. మీకు ఆఫీస్ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా అందిస్తుందని ఇది వరకే చెప్పా. 

ఢిల్లీలోని జేఎల్ఎన్ స్టేడియంలో ఇప్పటికే 18 ఆఫీసు గదులు సిద్ధంగా ఉన్నాయి. అవసరం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. కానీ, బంధుప్రీతికి అనుమతి లేదు. క్రీడా పరిపాలన అలా జరగకూడదు. మొన్న నేను ఒక అధికారిని కలిస్తే అతను తన ప్యూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సెక్రటరీగా చూపించాడు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని మాండవీయ స్పష్టం చేశారు. 

పదేండ్లలో ప్రతి క్రీడకు ఒక సెంటర్ ఆఫ్ ​ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

2036 ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఇండియా ఆతిథ్యం ఇవ్వాలన్న లక్ష్యంతో దేశంలో ప్రతి క్రీడకూ ఒక ఒలింపిక్ సెంటర్ లేదా సెంటర్ ఆఫ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను  రాబోయే పదేండ్లలో  ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఇందుకు కార్పొరేట్ సంస్థల నుంచి ఫండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 23 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెన్స్  ఉన్నా, వాటిలో కేవలం మూడు మాత్రమే ఒక్కో క్రీడకు ప్రత్యే కంగా  ఏర్పాటు చేశారు.

 ‘మన దేశంలో ప్రతి క్రీడకు ఒక ఒలింపిక్ సెంటర్ లేదా సెంటర్ ఆఫ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాబోయే పదేండ్లలో ఏర్పాట్లు చేయాలన్నది నా లక్ష్యం. ఇందుకు కార్పొరేట్ భాగస్వాములతో సహకారం తీసుకుంటాము. ఈ సెంటర్ల ద్వారా అథ్లెట్లకు అత్యుత్తమ శిక్షణ, అంతర్జాతీయ అనుభవం అందించాలి. ఇందుకోసం మినిస్ట్రీ, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కలిసి పని చేయాలి’ అని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు