Mohammed Shami: భయపడాల్సిన అవసరం లేదు.. మహమ్మద్ షమీకి లెటర్ రాసిన క్రీడా మంత్రి

Mohammed Shami: భయపడాల్సిన అవసరం లేదు.. మహమ్మద్ షమీకి లెటర్ రాసిన క్రీడా మంత్రి

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రిజ్వీ మరోసారి టార్గెట్ చేశాడు. షమీ కుమార్తె ఇటీవలే హోలీ ఆడుతున్న ఫోటో చూసి ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే షమీకి మధ్యప్రదేశ్ క్రీడా మంత్రి విశ్వాస్ సారంగ్ అండగా నిలిచారు. షాబుద్దీన్ రిజ్వీ చేసిన ప్రకటనను సారంగ్ తీవ్రంగా ఖండించారు. ఈ 'ఫండమెంటలిస్టులకు' తాను లేదా తన కుమార్తె భయపడాల్సిన అవసరం లేదని మంత్రి షమీకి లేఖ రాశారు.

మౌలానా వ్యాఖ్య తీవ్రవాదమని, దేశ సామాజిక సామరస్యానికి హానికరమని మంత్రి అభివర్ణించారు. అలాంటి రాజకీయాలను ఇకపై సహించబోమని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 'బుజ్జగింపు రాజకీయాలకు' పాల్పడుతోందని కూడా ఆయన ఆరోపించారు. " దేశ్ మే కత్తర్పంతీ ఔర్ చరణపంతీ అప్నీ సీమాయీం లాంగ్ రహే హైం. ఈస్ దేశ్ మే నఫ్రత్ కీ రాజ్‌నీతి నహీం చలేగీ .....(ఉగ్రవాదులు తమ హద్దులు దాటుతున్నారు. ఈ దేశంలో విద్వేషపూరిత రాజకీయాలు పనిచేయవు)" అని సారంగ్ తెలిపారు.

ALSO READ | MS Dhoni: ధోనీ, కోహ్లీ కెరీర్‌లో కఠినమైన బౌలర్లు వీరే.. ముగ్గురిలో ఇద్దరు ఇండియన్స్

తాను మహ్మద్ షమీకి ఒక లేఖ రాశానని, తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అతని భద్రతను నిర్ధారిస్తుందని హామీ ఇచ్చానని మంత్రి అన్నారు. షమీ ఈ దేశానికి గర్వకారణం. ఆయన కూతురు హొలీ ఆడినంత మాత్రానా ఒక చిన్న అమ్మాయిని బెదిరించడం దురదృష్టకరం.హోలీ భారతదేశ సంస్కృతిలో అంతర్భాగమని, ఒక వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛపై ఎవరూ ఆంక్షలు విధించలేరని మంత్రి సారంగ్ అన్నారు.

అంతక ముందు ఏం జరిగిందంటే..? 

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం (మార్చి 4) సెమీ ఫైనల్ మ్యాచ్ షమీ జ్యూస్ తాగుతున్న క్లిప్ ఒకటి వైరల్ అయింది. ఈ మ్యాచ్ లో షమీ జ్యూస్ తాగుతూ కనిపించడంతో అతన్ని ఒక ముస్లిం మత గురువు టార్గెట్ చేశాడు. పవిత్ర రంజాన్ మాసంలో షమీ ఉపవాసం (రోజా) లేకపోవడమే ఇందుకు ఆయన చెప్పాడు.  ఉపవాసం (రోజా) లేకుండా షమీ పాపం చేసాడని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ బరేల్వి అన్నారు.