క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ధ్యాన్ చంద్ అవార్డు నిలిపివేత

క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ధ్యాన్ చంద్ అవార్డు నిలిపివేత

ఆటల్లో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఇచ్చే మేజర్‌ ధ్యాన్‌చంద్‌  లైఫ్‌టైమ్ అవార్డును నిలిపివేస్తున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ అవార్డు స్థానంలో అర్జున లైఫ్‌టైమ్‌ అవార్డును ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. అలాగే, అట్టడుగు స్థాయిలో కోచ్‌లుగా కృషి చేసిన వారు ద్రోణాచార్య అవార్డుకు అర్హులని మంత్రిత్వ శాఖ పేర్కొంది.    

భారత హాకీ దిగ్గజం, మూడుసార్లు ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న భారత హాకీ జట్టులో సభ్యుడైన మేజర్ ధ్యాన్ చంద్ పేరు మీద ఈ అవార్డుకు ఆ పేరు పెట్టారు. ఒలింపిక్ క్రీడలు, పారాలింపిక్ క్రీడలు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు మొదలైన వాటిలో భాగమైన విభాగాల్లో రాణించిన క్రీడాకారులకు ఈ అవార్డును అందజేస్తారు. క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ ఈ అవార్డును అందజేస్తుంది.

ALSO READ | ఆర్థిక సాయం చేసి కుక్కను కాపాడండి..: భారత క్రికెటర్ సోదరి

అవార్డు గ్రహీతకు పతకం, ప్రశంసా పత్రం, నగదు అందజేస్తారు. నగదు మొత్తం గతంలో రూ.7.5 లక్షలు ఉండగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.25 లక్షలకు పెంచారు.  అయితే, అర్జున లైఫ్‌టైమ్‌ అవార్డు గ్రహీతకు అందే మొత్తంపై క్రీడా మంత్రిత్వ శాఖ ఎటువంటి ప్రకటన చేయలేదు. 2023లో మాజీ షట్లర్ మంజుషా కన్వర్, మాజీ హాకీ ఎక్స్‌పోనెంట్ వినీత్ కుమార్, కబడ్డీ ప్లేయర్ కవితా సెల్వరాజ్‌లు ధ్యాన్ చంద్ అవార్డుకు ఎంపికయ్యారు. 

ఈ ఏడాది అవార్డుల కోసం నామినేషన్లను దాఖలు చేసేందుకు వచ్చే నెల 14 వరకు గడువు ఉంది.