హైదరాబాద్: దేశంలో మహారాష్ట్ర తర్వాత యాక్టివ్ కరోనా కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఏపీలోని చాలా ప్రాంతాల్లో అసింప్టోమేటిక్ పేషెంట్స్ క్వారంటైన్ సెంటర్స్‌లో చేరుతున్నారు. వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా పేషెంట్స్ ఫిజికల్‌గా, మెంటల్‌గా బాధపడుతున్నారు. దీంతో క్వారంటైన్ సెంటర్స్‌ను హ్యాప్పీగా ఉంచాలని అధికారులు యత్నిస్తున్నారు. పేషెంట్స్‌లో ధైర్యాన్ని నింపడానికి అనంతరపురం అధికారులు ఓ కొత్త స్ట్రాటజీతో ముందుకొచ్చారు. క్వారంటైన్ సెంటర్స్‌లో ఉదయం స్పీకర్‌లో సుప్రభాతంను ప్లే చేసి రోజును ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు.
Sports,Music and Motivation can keep anyone balanced in the times of difficulties. Provided all the three to Corona Positive Persons( not “patients”) at Covid Care Centre,JNTU,Ananthapuramu pic.twitter.com/x8DdwoYHAP
— Gandham Chandrudu IAS (@ChandruduIAS) July 30, 2020
కరోనా పాజిటివ్ పేషెంట్స్‌కు అన్ని రకాల స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్స్‌ను అధికారులు ప్రొవైడ్ చేశారు. ఈ ఎక్విప్‌మెంట్స్‌ను రోజులో ఎప్పుడైనా వాడేలా అందుబాటులో ఉంచారు. వీటిల్లో ఎక్కువగా వాలీబాల్, క్యారమ్ లాంటి గేమ్స్‌ను ఆడుతున్నారు. ఈ ఆటలు పేషెంట్స్‌లో జోష్‌ను నింపడమే గాక ఈ ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అవడంపై అథారిటీస్ కూడా హ్యాపీగా ఉన్నారని తెలిసింది. కరోనా కేర్ సెంటర్స్‌లో ల్యాప్‌టాప్‌తోపాటు ఇంటర్నెట్, ప్రొజెక్టర్, లైవ్ స్ట్రీమ్ మ్యూజిక్, సినిమాలు చూసేలా ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేసింది. రోజుకు రెండు సార్లు పేషెంట్స్ మానసిక ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేయడానికి ప్రొఫెషనల్ సోషల్ కౌన్సిలర్స్‌ను ఏర్పాటు చేశారు.