![వారం రోజుల్లో స్పోర్ట్స్ పాలసీ ఫైనల్ అయితది : మంత్రి శ్రీనివాస్ గౌడ్](https://static.v6velugu.com/uploads/2023/02/Sports-policy-will-be-finalized-within-a-week-Minister-Srinivas-Goud_lavHA1xSVh.jpg)
వారం రోజుల్లో స్పోర్ట్స్ పాలసీ ఫైనల్ అవుతుందని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడ్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడలకు నిధులు కేటాయిస్తున్నామన్న ఆయన.. క్రీడా ప్రాంగణాలు కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. బాక్సర్ నిక్కత్ జరీన్ కు, షూటర్ ఈషా సింగ్ కు డీఎస్పీ ఉద్యోగం, బంజారాహిల్స్ లో 600 గజాల స్థలం ఇస్తున్నామని ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్యకు కూడా హైదారాబాద్ లో 600 గజాల భూమి, డబ్బులు ఇచ్చామని చెప్పారు.
మరోవైపు తనకు హైదారాబాద్ లో 600 గజాల జాగా ఇవ్వడంపై కిన్నెర మొగులయ్య ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. తమ తాత తరాల నుండి కిన్నెర వాయిద్యంను కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. తమ కళను కాపాడిన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆనందం వ్యక్తం చేశారు.