- ములుగు జిల్లాలో సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీ
ములుగు, వెలుగు : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నవంబర్ లో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్టు, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. సీఎం కప్ క్రీడోత్సవాల క్రీడా జ్యోతి ర్యాలీ సోమవారం ములుగుకు చేరింది. గట్టమ్మ సమీపంలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి ములుగు కలెక్టరేట్ వరకు టార్చ్ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే సీఎం కప్ పోటీల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనే విధంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
గ్రామ స్థాయి యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు పరిపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారన్నారు. జిల్లా నుంచి ప్రపంచస్థా యిలో రాణించే విధంగా క్రీడాకారులు తయారు కావాలని, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురా వాలని సూచించారు. ర్యాలీలో సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
అనంతరం టార్చ్ర్యాలీ క్రీడాకారులు భద్రాద్రి జిల్లాలోకి వెళ్లారు. అంతకుముందు ములుగు మండలం ఇంచెర్లఎర్రి గట్టమ్మ వద్ద స్పోర్స్ స్కూల్ ఏర్పాటుకు అనువైన 38 ఎకరాల స్థలాన్ని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ , కలెక్టర్ పరిశీలించారు. ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, యువజన క్రీడల అధికారి తుల రవి, తహసీల్దార్ విజయ్ భాస్కర్, ప్రజా ప్రతినిధులు, అధికార సిబ్బంది, క్రీడాకారులు, విద్యార్థులు
పాల్గొన్నారు.