- ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి దీపా దాస్ మున్షి
అంబర్‌పేట, వెలుగు: దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయడం అభినందనీయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి దీపా దాస్ మున్షి అన్నారు. రాజీవ్ గాంధీ 18వ స్మారక అండర్-19 డే అండ్ నైట్ టీ-20 లీగ్ క్రికెట్ చాంపియన్‌షిప్ -2025 పోటీలు అంబర్‌పేటలోని వాటర్ వర్క్స్ మైదానంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏఐసీసీ సెక్రటరీ పి.విశ్వనాథన్, తమిళనాడు ఎమ్మెల్యే జె.ఎ.హసన్. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డితో కలిసి దీపాదాస్ మున్షీ ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమలాకర్ రావు టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్ రావు, టీపీసీసీ ప్రధాన కార్యదదర్శులు ఆర్. లక్ష్మణా యాదవ్, బొల్లు కిషన్, ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆది అవినాష్ పాల్గొన్నారు.