ములుగు ట్రైబల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలో స్పాట్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్లు

ములుగు ట్రైబల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలో స్పాట్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్లు

ములుగు, వెలుగు : ములుగులోని ట్రైబల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలో స్పాట్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్లకు అప్లై చేసుకోవాలని ఎగ్జామినేషన్‌‌‌‌‌‌‌‌ కంట్రోలర్‌‌‌‌‌‌‌‌ తుకారాం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీఏ హానర్స్‌‌‌‌‌‌‌‌ ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌, బీఏ హానర్స్‌‌‌‌‌‌‌‌ ఎకనామిక్స్‌‌‌‌‌‌‌‌ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌లలో అడ్మిషన్‌‌‌‌‌‌‌‌ కొనసాగుతోందని, మిగిలిన సీట్లకు అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3న కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌ జనరల్ కేటగిరీలో 9, ఎస్సీ 4, ఎస్టీ 2, ఓబీసీ 7, ఈడబ్ల్యూఎస్ 2 మొత్తం 24, ఎకనామిక్స్‌‌‌‌‌‌‌‌లో జనరల్‌‌‌‌‌‌‌‌ 8, ఎస్సీ 4, ఎస్టీ 2, ఓబీసీ 7, ఈడబ్ల్యూఎస్ 2 కలిపి మొత్తం 23 సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు.

సీయూఈటీ, యూటీ  2024 ఎంట్రెన్స్‌‌‌‌‌‌‌‌లో మెరిట్‌‌‌‌‌‌‌‌ సాధించిన వారికి ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రయారిటీ ఉంటుందని, ఒకవేళ సీట్లు మిగిలితే ఇంటర్‌‌‌‌‌‌‌‌లో 60 శాతం కంటే ఎక్కువ వచ్చిన విద్యార్థులకు అడ్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇస్తామని పేర్కొన్నారు. అర్హులైన వారు టెన్త్‌‌‌‌‌‌‌‌, ఇంటర్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లు, టీసీ, మైగ్రేషన్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లతో పాటు పాస్‌‌‌‌‌‌‌‌ఫొటోలు, మెడికల్‌‌‌‌‌‌‌‌ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌ అఫిడవిట్‌‌‌‌‌‌‌‌, క్యాస్ట్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌తో https://ssctucuet.samarth.edu.in/ సైట్‌‌‌‌‌‌‌‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99590 90799 నంబర్‌‌‌‌‌‌‌‌ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.