స్పాట్​ బెల్లీడ్​ ఈగిల్​ గుడ్లగూబ

స్పాట్​ బెల్లీడ్​ ఈగిల్​ గుడ్లగూబ

మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వులో స్పాట్​ బెల్లీడ్​ డేగ గుడ్లగూబ మొదటిసారిగా కనిపించింది. దీనిని ఫారెస్ట్​ ఈగిల్​ గుడ్లగూబ అని కూడా పిలుస్తారు. ఇది భయంకరమైన రూపాన్ని కలిగి ఉండే పెద్ద పక్షి. ఈ గుడ్లగూబ శాస్త్రీయ నామం కేతుప నిపలెన్నిస్​. ఇవి ఉష్ణమండల, ఉప ఉష్ణమండల అడువులు, చిత్తడి నేలలు, సవన్నాలతో సహా పలు రకాల ఆవాసాలలో కనిపిస్తాయి.

సాధారణంగా భారతదేశం, శ్రీలంక, నేపాల్​, భూటాన్​, బంగ్లాదేశ్, ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో కనిపిస్తాయి. ఇది గుడ్లగూబలోనే పెద్ద జాతి. ఇది 50 నుంచి 65 సెం.మీ. పొడవు 1500 నుంచి 1700 గ్రాముల వరకు బరువు ఉంటుంది. దీని రెక్కలు 1.7 మీటర్ల వరకు ఉంటాయి. ఇది ఎలుకలు, చిన్న క్షీరదాలు, సరీసృపాలు, కీటకాలను తింటుంది.