పెద్ద ప్లానింగే ఇది.. స్పాటిఫైలో ఇకపై సాంగ్స్ వినడమే కాదు..

పెద్ద ప్లానింగే ఇది.. స్పాటిఫైలో ఇకపై సాంగ్స్ వినడమే కాదు..

స్పాటిఫై అనగానే సాంగ్స్ గుర్తొస్తాయి. ఇప్పుడు స్పాటిఫైలో సాంగ్స్ వినడమే కాదు.. యూట్యూబ్​లో మాదిరిగా వీడియోలను కూడా క్రియేట్ చేయొచ్చు. గతంలో సొంతంగా పాడ్​కాస్ట్​లను క్రియేట్​ చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పుడు వీడియోలను క్రియేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.  వాటికి వచ్చిన వ్యూస్​ ఆధారంగా పార్ట్​నర్ ప్రోగ్రామర్​​ని కూడా స్టార్ట్ చేసింది.  అంటే.. వీడియో కంటెంట్​తోపాటు అడ్వర్టైజ్​మెంట్స్ కూడా చేయొచ్చు. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూకేలలో జనవరిలో అందుబాటులోకి రానున్నాయి.

ఇందులో నావిగేషన్, కామెంట్స్, జూమ్​ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. వీడియోలే కాకుండా పాడ్​కాస్ట్​లలోని చిన్న క్లిప్​లను కూడా స్పాటిఫైలో షేర్ చేసుకోవచ్చు. క్రియేటర్స్ హోమ్​ ఫీడ్​లు యాప్​ల్లోని ఇతర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. అంతేనా.. స్పాటిఫై వీడియోలకు కూడా థంబ్​నైల్స్ పెట్టుకోవచ్చు. కంటెంట్ క్రియేటర్స్ తమ వీడియో ఎలా రీచ్ అవుతుందో ట్రాక్ చేసుకునేందుకు డాష్​బోర్డ్​ని కూడా రీడిజైన్ చేస్తోంది.

పాడ్​కాస్ట్​లు క్వాలిటీగా క్రియేట్ చేసుకునేందుకు ఆల్రెడీ స్పాటిఫై యాప్​లో ఇన్నర్​గా చాలా టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా ప్రొఫైల్​ పిక్చర్ కోసం ఏఐ టూల్​ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే యూట్యూబ్​ లాంటి యాప్స్ తీసుకురావాలని చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. అయితే త్వరలోనే స్పాటిఫై ఈ ఫీచర్స్​ని యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.