
ఇటీవలే మనదేశంలో విడుదలైన ఆన్లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ ‘స్పోటిఫై’ తాజాగా లైట్ వెర్షన్‌ను విడుదల చేసింది. తక్కువ ర్యామ్, మెమొరీ కలిగిన స్మార్ట్ఫోన్ల కోసం కొత్త వెర్షన్రూపొందించారు. 10 ఎంబీ సైజ్ మాత్రమే కలిగిన ఈ యాప్ ఓల్డ్ ఫోన్లు వాడుతున్న యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్ నెట్ కనెక్టివిటీ ఉన్నా కూడా ఇది పని చేస్తుందని చెప్తోంది కంపెనీ. పాటల స్టోరేజ్‌కు కూడా ఎక్కువ మెమొరీ అవసరం లేదు. ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రీమియమ్ యూజర్లు ఒకేసారి రెగ్యులర్ వెర్షన్, లైట్ వెర్షన్ కూడా వాడుకోవచ్చు. తక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగినా ఈ యాప్ వేగంగానే పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది.