
మహదేవపూర్, వెలుగు : వెహికల్ ఢీ కొని మచ్చల జింక మృతి చెందింది. ఫారెస్ట్ ఆఫీసర్లు, ఎఫ్ఆర్ వో రవి కుమార్ తెలిపిన ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ కాళేశ్వరం నేషనల్ హైవే – 353సీపై సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని మచ్చల జింక ప్రాణాపాయ స్థితిలో ఉందని సమాచారం అందింది.
వెంటనే వెటర్నరీ డాక్టర్ వెళ్లి చికిత్స చేస్తుండగానే చనిపోయింది. జింకకు పంచనామా చేసిన అనంతరం పూడ్చివేశారు. హైవే వెంట వన్యప్రాణులు తిరిగే ప్రాంతాల్లో సైన్ బోర్డులు పెట్టామని, వెహికల్ లో వెళ్లేవాళ్లు జాగ్రత్తగా వెళ్లాలని ఎఫ్ ఆర్ వో సూచించారు.