ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల అక్కడ చదువుకుంటున్న వివిద దేశాలకు చెందిన విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆయా దేశాలు తమ విద్యార్థుల కోసం ఉక్రెయిన్ ప్రభుత్వంతో పాటు చుట్టు పక్కల ఉన్న దేశాలతో కూడా మంతనాలు సాగిస్తున్నాయి. ఈ తరహాలోనే భారత ప్రభుత్వం కూడా ఉక్రెయిన్లో ఉన్న భారత విద్యార్థులను తరలించడానికి చుట్టు పక్కల దేశాలను ఉపయోగించుకుంటోంది. యుద్ధం వల్ల చిక్కుకుపోయిన విద్యార్థులను రొమానియాకు బస్సుల ద్వారా తరలించి అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానాల ద్వారా ఇండియాకు తరలిస్తున్నారు.
ఈ క్రమంలో భారత విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సులకు భారత దేశ జెండాను పెట్టుకొని బయలుదేరాలని సూచించింది. దాంతో భారత విద్యార్థులు జెండా పెట్టుకొని గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఇదే అవకాశాన్ని పాక్, టర్కీ విద్యార్ధులు కూడా వాడుకుంటున్నారని ఇండియన్ స్టూడెంట్స్ చెబుతున్నారు.
‘మా ఫ్లాట్ దగ్గర మమ్మల్ని చూసిన సైన్యం మీ దగ్గర ఇండియన్ ఫ్లాగ్ ఉంది, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. ఎలాగోలా ఇండియన్ ఫ్లాగ్ సిద్ధం చేసుకున్నాం. మా బస్సు ముందు రెండు పెద్ద భారతీయ జెండాలు పెట్టుకున్నాం. దాంతో మాకు అన్ని చోట్లా ముందుకు వెళ్లేందుకు అనుమతి లభించింది. ఇండియన్స్, ఇండియా ఫ్లాగ్ సాయం.. పలువురు పాక్, టర్కీ విద్యార్థులు కూడా సేఫ్‌గా బయటపడగలుగుతున్నారు’ అని రొమేనియా చేరుకున్న ఓ భారత విద్యార్థి చెప్పాడు.
#WATCH | "We were easily given clearance due to the Indian flag; made the flag using a curtain & colour spray...Both Indian flag & Indians were of great help to the Pakistani, Turkish students," said Indians students after their arrival in Bucharest, Romania#UkraineCrisis pic.twitter.com/vag59CcPVf
— ANI (@ANI) March 2, 2022
‘‘నేను ఆ జెండాను తయారు చేశాను. మార్కెట్‌కు వెళ్లి కలర్ స్ప్రే తీసుకొచ్చాను. ఇంకో దుకాణానికి వెళ్లి కర్టెన్లు తీసుకొని వచ్చాను. వాటితో భారతీయ జెండా తయారుచేశాను. నా దగ్గర ఆ వీడియో కూడా ఉంది. మేం ఇంటి నుంచి బయటకొచ్చేటప్పుడు బస్సుకు జెండా అతికించి మన జాతీయ పాడాం. ఇదే అవకాశాన్ని కొంతమంది టర్కీ, పాకిస్థాన్ విద్యార్థులు కూడా వాడుకుంటున్నారు. భారత జెండా పట్టుకొని వారివారి గమ్యాలకు చేరుకుంటున్నారు. మన జెండా వల్ల వారికి పెద్ద సాయం అందింది ’ అని ఉక్రెయిన్ నుంచి రొమానియా రాజధాని బుకారెస్ట్ చేరుకున్న భారత విద్యార్ధులు తెలిపారు.
For More News..