ఎస్వీఎస్ లో ముగిసిన స్ప్రింగ్ ఫైర్ 2024 వేడుకలు

హసన్ పర్తి,వెలుగు : హనుమకొండ జిల్లా భీమారంలోని ఎస్వీఎస్  కాలేజీ లో  స్ప్రింగ్ ఫైర్ 24 వేడుకలు అదివారం ఘనంగా ముగిశాయి.  ఈ సందర్భంగా  సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు.   కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా  కాలేజీ పూర్వ విద్యార్థి  జబర్దస్త్ ఫేమ్  రచ్చ రవి, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ వరుణ్ వచ్చారు.  ఈ కార్యక్రమంలో  కాలేజీ చైర్మన్​   డా . తిరుమల రావు  పాల్గొన్నారు.