
కాజీపేట, వెలుగు : కాజీపేటలోని ఎన్‌ఐటీలో శుక్రవారం నుంచి ‘స్ప్రింగ్ స్ర్పీ 2025’ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. స్ర్పింగ్ స్ర్పీ ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం హాజరుకానున్నారు. ఎన్‌ఐటీ డైరెక్ట్‌ర బిద్యాధర్ సుబుధి గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్ర్పింగ్ స్ర్పీ వివరాలు వెల్లడించారు. శుక్రవారం నుంచి మార్చి 2 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మొదటి రోజున బ్రహ్మానందం హాజరుకానుండగా, రెండో రోజున భారతీయ రాక్ బ్యాండ్ వార్డెక్స్ ఆధ్వర్యంలో ప్యూజన్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంటుందని, రెండు సినిమా టీమ్స్ స్టూడెంట్లతో ప్రత్యక్షంగా ముఖాముఖి చర్చలో పాల్గొంటారని వివరించారు. చివరి రోజైన మార్చి 2న ప్రముఖ గాయకుడు అమిత్ త్రివేది సంగీత ప్రదర్శన ఉంటుందని చెప్పారు. వీటితో పాటు సోలో, గ్రూప్ డ్యాన్స్‌లు, ఫ్యాషన్ షో, ఫిల్మ్ మేకింగ్, గేమింగ్ పోటీల వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రొఫెసర్లు శ్రీనివాసరావు, రాజ్‌మోహన్, స్ప్రింగ్ స్ర్పీ స్టూడెంట్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.