హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్, కాంట్రాక్ట్ ఫార్మింగ్, గ్రీన్హౌస్ టెక్నాలజీ వ్యాపారంలో నిమగ్నమైన అహ్మదాబాద్ కంపెనీ స్ర్పైట్ ఆగ్రో లిమిటెడ్ రూ.44.87 కోట్ల రైట్స్ ఇష్యూ సోమవారం మొదలయింది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ అవసరాలు, విస్తరణ కోసం వాడతారు. ఈ నెల 21న షేరు ముగింపు ధర రూ.45.69 కాగా, కంపెనీ రైట్ ఇష్యూలో షేరుని రూ.13.4లకు అందిస్తోంది.
ఇది వచ్చే నెల 12న ముగుస్తుంది. రూపాయి ముఖ విలువ కలిగిన 3,34,84,611 పెయిడ్-అప్ ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.13.4 (ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.12.4 ప్రీమియంతో కలిపి) రూ.44.87 చొప్పున నగదు రూపంలో జారీ చేయనుంది.