హైదరాబాద్​కు ‘స్పుత్నిక్​ V’.. త్వరలో ట్రయల్స్

హైదరాబాద్​కు ‘స్పుత్నిక్​ V’.. త్వరలో ట్రయల్స్

ఇండియాలో ట్రయల్స్ కోసం రష్యా నుంచి వచ్చిన కరోనా వ్యాక్సిన్​

రెడ్డీస్​ ల్యాబ్స్​కు చేరుకున్న టీకా డోసులు

వాలంటీర్ల ఎంపిక మొదలు.. 15వ తేదీ తర్వాత టెస్టింగ్

వ్యాక్సిన్​ 92 శాతం ఎఫెక్టివ్​గా ఉందన్న సైంటిస్టులు

హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే ఫస్ట్​ రిజిస్టరైన రష్యా కరోనా వ్యాక్సిన్​‘స్పుత్నిక్​V’ మూడో దశ ట్రయల్స్​ కోసం హైదరాబాద్​కు చేరుకున్నట్టు సమాచారం. ఇండియాలో ట్రయల్స్​ కోసం ఈ వ్యాక్సిన్​ డోసులు రష్యా నుంచి హైదరాబాద్​లోని రెడ్డీస్​ ల్యాబ్స్​కు చేరుకున్నట్టు తెలిసింది. ఈ ట్రయల్స్​కు సంబంధించి ఇప్పటికే వలంటీర్ల ఎంపిక మొదలైందని.. ఈ నెల 15వ తేదీ తర్వాత ట్రయల్స్​మొదలుపెట్టే అవకాశం ఉందని సమాచారం. ‘స్పుత్నిక్​V’ వ్యాక్సిన్​ మూడో దశ క్లినికల్​ ట్రయల్స్, తయారీ, పంపిణీకి సంబంధించి డాక్టర్​ రెడ్డీస్ ల్యాబ్స్​ కంపెనీతో.. రష్యా డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​ (ఆర్డీఐఎఫ్​) ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా దాదాపు 10 కోట్ల డోసులను డాక్టర్​ రెడ్డీస్​ తయారు చేయనుంది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్​ కోసం వ్యాక్సిన్​ వచ్చినట్టు ఫార్మా వర్గాలు వెల్లడించాయి.

కరోనా పనిపడుతోంది

‘స్పుత్నిక్​V’ మంచి ఫలితాలనిస్తోందని సైంటిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్​ జరుగుతున్న ఈ వ్యాక్సిన్​కు సంబంధించి ఇంటరిమ్​ అనాలిసిస్​ డేటాను.. ఆ టీకా తయారు చేసిన గమాలీయా నేషనల్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఎపిడెమియాలజీ అండ్​ మైక్రోబయాలజీ విడుదల చేసింది. రెండు డోసులు తీసుకున్న 16 వేల మందిపై టీకా ప్రభావం 92 శాతం వరకు ఉందని వెల్లడించింది. క్లినికల్​ ట్రయల్స్​ కాకుండా.. ఎమర్జెన్సీ యూజ్​లో భాగంగా వ్యాక్సిన్​ వేసిన 10 వేల మంది డాక్టర్లు, ముప్పు ఎక్కువున్న ప్రజల్లోనూ టీకా 90 శాతం పని చేసిందని ప్రకటించింది. ప్రస్తుతం ఒక్క రష్యాలోనే 40 వేల మందిపై థర్డ్​ ఫేజ్​ ట్రయల్స్​ చేస్తున్నట్టు చెప్పింది. ఇందులో 20 వేల మందికిపైగా ఫస్ట్​ డోస్​, 16 వేల మందికిపైగా ఫస్ట్​, సెకండ్​ డోస్​ వ్యాక్సిన్లను వేసినట్టు వివరించింది. ఇప్పటిదాకా ఎవరికీ ఎలాంటి సైడ్​ఎఫెక్ట్స్​ రాలేదని తెలిపింది.

For More News..

నెల అయినా బురదల్నే