ఒలింపిక్స్‌లో స్క్వాష్.. కళ నెరవేరిందంటూ ఇండియన్ ప్లేయర్స్ ఎమోషనల్

ఒలింపిక్స్‌లో స్క్వాష్.. కళ నెరవేరిందంటూ ఇండియన్ ప్లేయర్స్ ఎమోషనల్

2028 జరిగే ఒలింపిక్స్ లో కొత్తగా క్రీడలను చేర్చిన సంగతి తెలిసిందే. వాటిలో క్రికెట్ తో పాటు స్క్వాష్ కూడా ఒకటి. WSF, US స్క్వాష్ మరియు PSA లు LA28 ఒలింపిక్ క్రీడల ఆర్గనైజింగ్ కమిటీకి తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. స్క్వాష్ ఒలింపిక్ క్రీడలకు తీసుకువచ్చే విలువను గుర్తించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
 
మొదటిసారి స్క్వాష్ ని ఒలింపిక్స్ లో చేర్చడం పట్ల భారత స్క్వాష్ ఆటగాళ్లు స్పందించారు. తమ కల నెరవేరిందంటూ ఎమోషనల్ అయ్యారు. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తర్వాత, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో స్క్వాష్‌ను చేర్చడం గురించి వారు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడలు 2023లో మిక్స్‌డ్ డబుల్స్ స్క్వాష్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన దీపికా పల్లికల్ మరియు హరీందర్ పాల్ సంధు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.