జనగామ అర్బన్, వెలుగు : జనగామ ఏసీపీగా ఎస్‌ఆర్.దామోదర్‌రెడ్డి బుధవారం ఛార్జ్ తీసుకున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన దేవేందర్‌రెడ్డి హనుమకొండ ఏసీపీగా ట్రాన్స్‌ఫర్ కావడంతో ఆయన స్థానంలో దామోదర్‌రెడ్డి నియామకం అయ్యారు. ఛార్జ్ తీసుకున్న అనంతరం ఏసీపీ మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్‌ను కాపాడేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. నిత్యం ఆఫీస్‌లో అందుబాటులో ఉంటానని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్‌గా కలవవచ్చని చెప్పారు. అనంతరం ఆయనను సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు సృజన్‌కుమార్, అరుణ్‌కుమార్, తిరుపతి, మాచర్ల శ్వేత, ఏసీపీ ఆఫీస్సిబ్బంది మాధవ్, క్రాంతి కలిసి గ్రీటింగ్స్ చెప్పారు.
హనుమకొండ ఏసీపీగా దేవేందర్‍రెడ్డి
వరంగల్, వెలుగు : హనుమకొండ ఏసీపీగా కొత్త దేవేందర్‍రెడ్డి బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. గతంలో జనగామలో పనిచేసిన ఆయన ట్రాన్స్‌ఫర్‌పై హనుమకొండకు వచ్చారు. ఛార్జ్ తీసుకున్న అనంతరం మర్యాదపూర్వకంగా కమిషనర్ అంబర్ కిశోర్ ఝాను కలిశారు.
పర్వతగిరి ఎంపీడీవోగా శంకర్
పర్వతగిరి, వెలుగు : వరంగల్ జిల్లా పర్వతగిరి ఎంపీడీవోగా ఎం.శంకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎంపీడీవో సంతోష్‌కుమార్ సూర్యాపేట జిల్లాకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఆయన స్థానంలో భూపాలపల్లి జిల్లా కాటారం ఎంపీడీవోగా పనిచేస్తున్న శంకర్ పర్వతగిరికి వచ్చారు.
ఛార్జ్ తీసుకున్న సీఐ, ఎంపీడీవోలు
మరిపెడ/చిన్నగూడూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా మరిపెడ, చిన్న గూడూరు మండలాల్లో సీఐలు, ఎస్సై, ఎంపీడీవోలు బుధవారం ఛార్జ్ తీసుకున్నారు. మరిపెడ సీఐగా హతీరాం నాయక్, ఎంపీడీవోగా రేవతి, చిన్న గూడూరు ఎస్సైగా ఝాన్సీ, చిన్న గూడూరు ఎంపీడీవోగా రామారావు డ్యూటీలో చేరారు. అలాగే మరిపెడ మున్సిపల్ కమిషనర్‌గా వెంకటస్వామి నియామకం అయ్యారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎంపీడీవోగా ఉమాదేవిస్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎంపీడీవోగా ఉమాదేవి బుధవారం డ్యూటీలో చేరారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆమె ట్రాన్స్‌ఫర్‌పై స్టేషన్‌ఘన్‌పూర్‌కు వచ్చారు.