పంజాగుట్టలో 3 కేజీల గంజాయి సీజ్

పంజాగుట్ట, వెలుగు: గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులతోపాటు ఆరుగురు కస్టమర్లను వెస్ట్ జోన్ ​టాస్క్​ఫోర్స్, ఎస్ఆర్​ నగర్ పోలీసులు కలిసి అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 3 కేజీల సరుకు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆరపాటి హరికృష్ణ  (24) ఎగ్​ కుల్ఫీ వెండర్​గా పని చేస్తూ బల్కంపేట ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఉంటున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన జాబ నవీన్ ​(26) ఎలక్ట్రిషియన్​గా పనిచేస్తున్నాడు.

 ఈజీమనీ కోసం వీరిద్దరూ వివిధ ప్రాంతాల నుంచి సిటీకి గంజాయి తీసుకొచ్చి, ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో బల్కంపేటలో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు కస్టమర్ల నుంచి ఏడు సెల్​ఫోన్లు, రెండు వేయింగ్​ మెషీన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెంకట రమణ తెలిపారు.