టెన్త్ ఫలితాల్లో ఎస్సార్ విద్యార్థుల ప్రభంజనం

హన్మకొండ సిటీ: టెన్త్ ఫలితాలలో ఎస్సార్ విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. తమ విద్యాసంస్థకు చెందిన 124 మంది విద్యార్థులు 10 కి10 జీపీఏ సాధించినట్లు ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఏ.వరదారెడ్డి వెల్లడించారు.10 జీపీఏ సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ..క్రమశిక్షణతో కూడిన విద్య, పటిష్టమైన పాఠ్య ప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందం వల్లే మంచి మార్కులు సాధించామని తెలిపారు. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని అమలు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.