ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోడ్డు నెంబర్ 7 లో శ్రమదానం నిర్వహించారు. కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు కలిసి రోడ్డుపై ఉన్న పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను తొలగించారు.
కాలనీ అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ గోసికొండ అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్, ట్రెజరర్సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షుడు కొక్కెర భూమన్న, సుంకె శ్రీనివాస్, కార్యదర్శి ఎల్.సాయన్న, రాజ్ కుమార్, బొల్లు జీవన్, కె.ముత్తెన్న, ఎర్ర భూమయ్య పాల్గొన్నారు.