హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం జరుగుతోంది. దాదాపు సగం రోజులు కూడా గడిచాయి. వరలక్ష్మి వ్రతం.. రాఖీ పౌర్ణమి పండుగలు ఈ ఏడాది ( 2024) ముగిశాయి. శ్రావణమాసంలో శంకరుడుని పూజించడం కూడా పవిత్రమైందిగా చెబుతుంటారు. ఈ సమయంలో ఉపవాసాలు సహా పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అంతే కాకుండా చాలా మంది శంకరుడిని పూజిస్తుంటారు. శ్రావణ మాసంలో శనివారం (ఆగస్టు 24) చాలా ప్రత్యేకమైంది. అంతే కాకుండా శ్రావణంలో శనివారం కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల శని, రాహువులను ప్రసన్నం చేసుకోవడంతో పాటు... జాతకంలోని ఉన్న దోషాలు తొలగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఈ మంత్రాలను జపించండి
శ్రావణ శనివారాల్లో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పాటించడం ద్వారా శనితో పాటు రాహు కేతువులకు పూజ చేసి వారి అనుగ్రహం పొందవచ్చు. అంతేకాక ఓం శనైశ్ఛరాయై రాయే నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శని దేవుడు అనుగ్రహాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. రాహువును శాంతింపజేయడానికి శనివారం నాడు 108 సార్లు ఓం రాహువే నమః ఇంకో 108 సార్లు కేతువు అనుగ్రహం కోసం ఓం కేతవే నమః పఠించాలని పండితులు చెబుతున్నారు.
ఆవులకు ఆహారం ఇవ్వండి
నంది... శంకరుడికి వాహనం. శ్రావణమాసంలో శనివారం(ఆగస్టు 24) రోజు ఆవును నందిగా భావించి బెల్లం, శనగపిండి తినిపించండి. ఫలితంగా శంకరుడితో పాటు శనిదేవుడి అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా రాహు, కేతువుల ప్రభావం నుంచి కూడా తగ్గుతుంది. మీరు శనిని సంతోషంగా ఉంచినట్లయితే రాహు, కేతు స్వయం చాలక గ్రహాల శుభ ప్రభావం మీపై ఉంటుంది.
నల్లని వస్త్రాలు, నల్లని నువ్వుల దానం
నలుపు రంగు వస్త్రాలు, నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. శనివారం రోజు ఈ పరిహారాలు చేయడం వల్ల రాహు, కేతువుల సంబంధిత దోషాలు తొలగిపోతాయి. శ్రావణ మాసంలో వీటిని దానం చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం , ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది.
శని యంత్ర స్థాపన:
శ్రావణ శని వారాల్లో (ఆగస్టు 24)పూజా స్థలంలో శని యంత్రాన్ని ఉంచడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శని క్రమం తప్పకుండా పూజించడం వల్ల శని అనుగ్రహం పొందవచ్చు. అందుకే శ్రావణ మాసంలో శని యంత్రాన్ని ప్రతిష్టించడం మంచిది.
శంకరుడి ఆరాధన
శంకరుని ఆరాధించడం, శివ మంత్రాలు పఠించడం ద్వారా జాతకంలో రాహు- కేతువులను శాంతింప చేయవచ్చు. అంతే కాకుండా శంకరుడికి నీరు, పూలు సమర్పించడం మంచిది.