శ్రావణ మాసంలో  మాంసం తినకపోవడానికి అసలు కారణం ఇదే...

శ్రావణ మాసంలో  మాంసం తినకపోవడానికి అసలు కారణం ఇదే...

శ్రావణమాసం పూజల మాసం అంటారు. ఈ నెలలో మాంసాహారం తినకూడదని పెద్దలు చెబుతంటారు. అమ్మవారికి పూజలు చేస్తారు.. ఇది చాలా పవిత్రమైన మాసం.. మాంసాహారం తింటే దేవుని అనుగ్రహం లభించదంటారు.  ఈ కారణంగా చాలామంది మాంసం ముట్టరు. అసలు ఈ కాలంలో నాన్​ వెజ్​ తినకపోవడానికి కేవలం ఆధ్యాత్మికమైనా... సైంటిఫిక్​ రీజన్స్​ ఉన్నాయా.. అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. . . 

హిందూ క్యాలండర్​ ప్రకారం శ్రావణ మాసంలో చాలా పండుగలు జరుపుకుంటారు. శ్రావణ మాసంలో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.  ఈ నెలలో  నిష్టగా లక్ష్మీదేవికి పూజలు చేస్తారు.  మహిళలు వ్రతం, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ విషయానికై చాలా మందికి సందేహాలు ఉంటాయి. శ్రావణ మాసంలో నాన్వెజ్ ఎందుకు తీసుకోరు అని. దీనికి పలు సైంటిఫిక్ కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

  • శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో కోళ్లు, ఇతర జంతువులకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధితో ఉన్న జంతువులను తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
  •  సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో శరీరంలో జీర్ణ వ్యవస్థ, రోగనిరోధక శక్తి మందగిస్తుంది. ఇలాంటప్పుడు మాంసం తినడంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.
  • ఈ రోజుల్లో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉన్నందున శ్రావణంలో ఎక్కువగా సాధారణ ఆహారాన్ని తినమని వైద్యులు సూచిస్తారు.
  • వర్షాకాలంలో గాలి, నీరు, ఆహారంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఆహారంలో స్వల్ప భాగం కూడా ఫుడ్ పాయిజనింగ్ .. డయేరియాకు కారణం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • నాన్ వెజ్‌ను ధృడమైన ఆహారంగా పరిగణిస్తారు, ఇది సులభంగా జీర్ణం కాదు. ఇది ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది.
  • నాన్​ వెజ్​ వల్ల ఎసిడిటీ వస్తుంది. దీంతో  కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతులు-విరేచనాలు మొదలైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
  • ఆయుర్వేదం ప్రకారం శ్రావణంలో మద్యం మరియు మాంసాన్ని వదిలివేయాలి. దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటంటే ఈ నెల మొత్తంలో తరచుగా వచ్చే వాతావరణ మార్పుల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడటంతో అనేక వ్యాధులు వస్తాయని ఆయుర్వేద వైద్యులు హెచ్చరిస్తున్నారు.