శ్రావణ మాసంలో శనివారం ప్రత్యేకత ఏంటి... ఏ పూజ చేస్తే మంచిది

శ్రావణ మాసంలో  శనివారం ప్రత్యేకత ఏంటి... ఏ పూజ చేస్తే మంచిది

జ్యోతిష్యాన్ని నమ్మేప్రతిఒక్కరూ శ్రావణమాసం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తుంటారు. శ్రావణమాసం శనివారానికి (ఆగస్టు 19)  మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజుకు  (ఆగస్టు 19) గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజు (ఆగస్టు 19)  కొన్ని పూజలు చేస్తే కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, మనశ్శాంతి, కోరిన కోరికలు నెరవేరడంతోపాటు అనుకున్న పనులన్నీ జరుగుతాయని చాలామంది నమ్మకం. పండితులు కూడా శ్రావణ శనివారం   (ఆగస్టు 19) పూజలు చేస్తే అంతామంచి జరుగుతుందని చెబుతుంటారు.  శ్రావణమాసం శనివారం గల ప్రాముఖ్యతను తెలుసుకుందాం. 

మన సంస్కృతీ సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ మాసాన్ని పూజల మాసం లేదా శుభాల మాసం, లేదా పండగల మాసం అని పిలుస్తుంటారు.  ఈ నెలలో ఈరోజు...ఆ రోజు అని కాకుండా అన్ని రోజులూ శుభకరమే. ఈ మాసంలో ప్రతి ఇంట్లో పూజలు జరుగుతుంటాయి. ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. శ్రావణమాసంలో వచ్చే ప్రతిరోజుకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ మాసమంతా శ్రవణనక్షత్రం ఉండటమే దీనికి కారణమని పండితులు చెబుతుంటారు. అయితే శ్రావణమాసంలో వచ్చే ప్రతిశనివారానికి (ఆగస్టు 19)  ఎంతో ప్రాముఖ్యత ఉంది. 

కలియుగంలో విష్ణుమూర్తి    ఎన్నో రూపాల్లో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించేందుకు భూలోకానికి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి రూపాల్లో అర్చితామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవేకంటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడని వేదాల్లో  రుషులు పేర్కొన్నారని  ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. శ్రీనివాసుడి నక్షత్రం శ్రవణం. కాబట్టి ఈనెలలో (శ్రావణమాసంలో) వచ్చే శనివారాల్లో  (ఆగస్టు 19)  శ్రీవేంటేశ్వరస్వామిని ఆరాధిస్తే అనంతఫలాలు వస్తాయట.  పూర్వం నుంచి శ్రావణ శనివారాల్లో వ్రతాలు చేయడం, పూజలు, ఉపవాసాలు వంటి ఆచారాలు  ఉన్నాయి. 

శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో (ఆగస్టు 19)  ఇంటి ఇలవేల్పుని పూజించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోతే..కనీసం ఒక్క శనివారమైనా..పూజా విధానాన్ని ఆచరించడం అన్నివిధాలా మంచిదని చెబుతున్నారు పండితులు.  ముఖ్యంగా కలియుగదైవమైన ఆ వేంకటేశ్వరుడికి ఆరాధన అనేది అత్యంత శక్తివంతం. శనివారాల్లో స్వామికి పాయసం, రవ్వకేసరి వంటి తీపిపదార్థాలు ప్రసాదంగా సమర్పించాలట. పిండి దీపాలతో స్వామివారిని ఆరాధించాలి. ఉపవాసం ఉండాలి. ఇలాంటి అన్ని చేసినట్లయితే విశేష ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.