
తన కెరీర్‌లో కంప్లీట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే సినిమా ‘రాబిన్‌హుడ్’ అని చెప్పింది శ్రీలీల. నితిన్‌కు జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శ్రీలీల ఇలా ముచ్చటించింది.
వరుస సినిమాల తర్వాత నా ఎడ్యుకేషన్ కోసం కొంత గ్యాప్ తీసుకోవాలి అనుకున్న టైమ్‌లో వెంకీ కాల్ చేసి ఈ కథ చెప్పారు. రష్మికకు ఎంతో నచ్చి చేయల్సిన క్యారెక్టర్. తనకు డేట్స్ కుదరకపోవడం వల్ల చేయలేదు. నాకు కూడా ఆ పాత్ర నచ్చడంతో ఓకే చెప్పా.
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ’ తర్వాత నితిన్‌తో నటించిన రెండో సినిమా ఇది. నితిన్‌తో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్.. ఫ్యామిలీ పర్సన్‌లా ఉంటారు. ఈ సినిమాతో మాది హిట్ పెయిర్ అవుతుందనే నమ్మకం ఉంది.
ఇందులో నా పాత్ర పేరు నీరా వాసుదేవ్. ఫారిన్ నుంచి ఇండియా వచ్చిన అమ్మాయిగా కనిపిస్తాను. ఈ ప్రపంచమంతా తన చుట్టూనే ఉంటుందనుకునే ఈ క్యారెక్టర్ చాలా క్యూట్ అండ్ బబ్లీగా ఉంటుంది. నితిన్ నాకు సెక్యూరిటీ ఇచ్చే వ్యక్తిగా కనిపిస్తారు. మా మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా ఉంటాయి. వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ గారి ట్రాక్ షూట్ చేస్తున్నప్పుడే పడి పడి నవ్వాం.
వెంకీ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. నాకు మంచి క్యారెక్టర్‌ను ఇచ్చారు. ఇంత ఫన్ ఉన్న సినిమాని నా కెరీర్‌లో ఇప్పటివరకు చేయలేదు. సినిమాపై టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
గతేడాది చాలా బిజీగా ఉన్నా. ప్రతి నెలలో ఒక రిలీజ్ ఉండడంతో ఒక్కొక్క రోజుకి 4, 5 షిఫ్ట్‌లు పని చేశా. మెడిసిన్ ఫైనల్ ఇయర్ కోసం ఒక ఏడాది బ్రేక్ తీసుకుంటానని నాకు ముందు నుంచే అంచనా ఉంది. అయితే ఈ గ్యాప్ లో చాలా మంచి సినిమాలు చేయలేకపోయాను. చాలా సినిమాలు వదులుకున్నాను. ఇప్పుడు మెడిసిన్ పూర్తయింది. అయితే కాలేజీలో కొన్ని రూల్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా అటెండ్ అవుతున్నా.
ప్రస్తుతం ‘పరాశక్తి’ సినిమా చేస్తున్నా. రవితేజ గారితో ‘మాస్ జాతర’లో నటిస్తున్నా. అలాగే కన్నడ, తెలుగులో ‘జూనియర్’ మూవీ చేస్తున్నా. ఇంకొన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి. త్వరలోనే వాటిని మేకర్స్ అనౌన్స్ చేస్తారు. ఇక నేను బాలీవుడ్‌లో సెటిల్ అవుతానని వస్తున్న వార్తలో నిజం లేదు. తెలుగు ఇండస్ట్రీ నా ఇల్లు. బాలీవుడ్‌కి వెళ్లిపోవడం ఎప్పటికీ జరగదు.