
ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు ఎక్కడకు వెళ్లినా అసహనానికి గురవుతున్నారు. హీరోయిన్లు.. సమాజంలో గుర్తింపున్న మహిళలు.. యాక్టివ్‌గా ఉండే మహిళలు బయటకు వెళితే చాలా వారు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కొంతమంది ఆకతాయిలు సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. అభిమానులు హద్దు మీరి ప్రవర్తి స్తున్నారు.
తాజాగా యువ హీరోయిన్ శ్రీలీలకు డార్జిలింగ్ లో చేదు అనుభవం ఎదురవుతున్నాయి . ఓ సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా కొందరు అభిమానులు ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Actress #Sreeleela mobbed by fans.pic.twitter.com/XAiBvPOsq6
— SR (@SR_India67) April 6, 2025
అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమ కథా చిత్రంలో కార్తీక్ ఆర్యన్ తో కలిసి శ్రీలీల నటిస్తుంది. సినిమాషూటింగ్ డార్జిలింగ్‌లో సీన్ క్రియేట్ చేస్తున్నారు. షూటింగ్ అయిన తరువాత వస్తుండగా శ్రీలలను కొంతమంది చుట్టుముట్టారు. దీంతో గుంపులో ఉన్న జనాలు కొందరు శ్రీలీల చేయి పట్టుకొని లాగడంతో షాక్‌నకు గురైంది. వెంటనే అప్రమత్తమైన సినిమా యూనిట్ సిబ్బంది శ్రీలీలను అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు శ్రీలీల పట్ల జరిగిన ఈ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాంటి ఆకతాయిలను సెలబ్రెటీలను దూరంగా ఉంచాలని స్పష్టం చేస్తున్నారు.