శ్రీలీల ఆల్ టైమ్ ఫేవరేట్ క్యారెక్టర్ ఇదే..

శ్రీలీల ఆల్ టైమ్ ఫేవరేట్ క్యారెక్టర్ ఇదే..

హీరోయిన్‌‌‌‌గా పరిచయమైన అతి కొద్దికాలంలోనే పాపులర్‌‌‌‌‌‌‌‌ అయిన శ్రీలీల.. వరుస స్టార్ హీరోల సినిమాలతో సెన్సేషనల్ అయింది.  బ్యాక్ టు బ్యాక్ తొమ్మిది సినిమాల్లో చాన్స్‌‌‌‌లు అందుకుంది. అయితే అవకాశాలు వచ్చినంత ఈజీగా విజయాలు రాలేదు. దీంతో కెరీర్‌‌‌‌‌‌‌‌లో కొంత నెమ్మదించిన శ్రీలీల.. ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉండే ఆమె.. ఇటీవల ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో నిర్వహించిన చిట్ చాట్‌‌‌‌లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చింది.

‘ఇప్పటివరకూ మీరు నటించిన చిత్రాల్లో మీకు ఎక్కువ ఇష్టమైన పాత్ర ఏది’ అని ఓ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు.. ఓ ఫొటోతో సమాధానమిచ్చింది శ్రీలీల. ముఖంపై గాటుతో ఆమె కనిపిస్తున్న ఆ ఫొటో ‘భగవంత్ కేసరి’ సినిమాలోది. బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల పోషించిన విజ్జి పాత్రకు చక్కని ప్రశంసలు దక్కాయి.

అందుకే హీరోయిన్‌‌‌‌గా హిట్ అందుకున్న సినిమాలను పక్కనబెట్టి.. ‘భగవంత్ కేసరి’లోని క్యారెక్టర్ తన ఆల్ టైమ్ ఫేవరేట్ అని చెప్పింది శ్రీలీల. ప్రస్తుతం తెలుగులో నితిన్,  రవితేజ సినిమాల్లో నటిస్తున్న ఆమె కోలీవుడ్,  బాలీవుడ్‌‌‌‌లోనూ అవకాశాలు అందుకునే ప్రయత్నంలో ఉంది.