
శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సింగిల్’.కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ‘శిల్పి ఎవరో’ (Shilpi Yevaro) అనే పాటను విడుదల చేశారు. విశాల్ చంద్ర శేఖర్ కంపోజ్ చేసిన ఈ సోల్ ఫుల్ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ని యాజిన్ నిజార్ పాడాడు.
‘ఏఐ కూడా ఊహించలేదుగా ఇంత అందాన్ని ఏం చెప్పినా.. యామ్ ఐ ఫాలింగ్ ఇన్ టు ది లవ్ అని స్టేటస్ పెట్టనా.. హెడ్ ఫోన్స్ ఏమో నీ చెవుల పైనా.. మ్యూజిక్ నాలో మొదలయ్యెనా.. శిల్పి ఎవరో శిల్పమెనుక.. తెల్పు చిరునామా నే సెల్ఫీ దిగుతా..’అంటూ శ్రీమణి రాసిన లిరిక్స్ ఇంప్రెస్ చేశాయి.
హీరో శ్రీవిష్ణు తన లైఫ్‌లోకి వచ్చిన ఇద్దరు అమ్మాయిల అందం గురించి కీర్తిస్తున్నట్టుగా ఈ పాటను చిత్రీకరించారు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 9న సినిమా విడుదల కానుంది.