
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు..ఆతరువాత హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం ఆయన సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.చాలా మంది యూత్ శ్రీవిష్ణు సినిమాలంటే ఇష్టపడతారు.సామజవరగమన సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు..రీసెంట్గా ఓం భీం బుష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి థ్రిల్ కలిగించింది.
ఇవాళ ఉగాది సందర్బంగా శ్రీవిష్ణు 19 కొత్త సినిమా షూటింగ్ ఆరంభం జరిగింది.నూతన దర్శకుడు జానకి రామ్ మారెళ్ల(Janaki Ram Marella) దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని స్కంద వాహన మోషన్ పిక్చర్స్, విజిల్ వర్తీ ఫిల్మ్స్, కేఎఫ్‌సీ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. శ్రీవిష్ణు బ్లాక్ బస్టర్ సామజవరగమనకి కథను అందించిన కథ రచయిత భాను భోగవరపు..తన (శ్రీవిష్ణు 19) మూవీకి కూడా అందిస్తుండటం విశేషం.
ప్రొడక్షన్ నంబర్ 1పై తెరకెక్కనున్న ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ కొల్లి అండ్ రైటర్ కోన వెంకట్ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ఈ వేడుకకి ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని, డైరెక్టర్స్ నందిని రెడ్డి, కిషోర్ తిరుమల స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్‌కి డైరెక్టర్ వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. శ్రీవిష్ణు కెరీర్ లో 18వ సినిమాగా వస్తున్న మూవీకి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా రాబోతుంది.
ఉగాది శుభాకాంక్షలు ?
— Sree Vishnu (@sreevishnuoffl) April 9, 2024
Delighted to begin the journey of my next project on the auspicious occasion of Ugadi ?#SreeVishnu19
Directed by #JanakiRamMarella
Music by @VijaiBulganin
Produced by #SeethaKumariKotha, #AnushaDronavalli, #GopalamLakshmiDeepak@konavenkat99… pic.twitter.com/NB8FZTWTbV