శ్రీ విష్ణు సింగిల్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

శ్రీ విష్ణు సింగిల్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

డిఫరెంట్ స్క్రిప్ట్ లు సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు శ్రీవిష్ణు. తాజాగా తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు.  ‘నిను వీడని నీడను నేనే’  ఫేమ్ కార్తీక్ రాజు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.  అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ  టైటిల్‌‌ గ్లింప్స్‌‌, ఫస్ట్ లుక్‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో  శ్రీ విష్ణు డిఫరెంట్ లుక్‌‌లో కనిపిస్తూ..  ఒక చేతిలో మ్యూజిక్ సిస్టం, మరొక చేతిలో దీపావళి క్రాకర్ పట్టుకుని రావడం ఆకట్టుకుంది. 

35 ఏళ్ల వయసులో కూడా తాను ఎందుకు ఒంటరిగా ఉన్నాడో హిలేరియస్‌‌గా వివరిస్తూ వెన్నెల కిశోర్ డైలాగ్‌‌తో ప్రారంభమైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. వాలెంటైన్స్ డే  రోజున పార్కులోకి మ్యూజిక్ సిస్టమ్‌‌తో  వెళ్లి ‘ఒంటరి వాడిని నేను.. ఎవ్వరి వాడిని కాను’అనే పాట వింటూ వెళ్లడం, అక్కడ బెలూన్లు పేల్చడం ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉంటుంది. 

ప్రస్తుతం ఇద్దరు అమ్మాయిలు  ప్రేమిస్తున్నా  ఇంకా ఒంటరిగానే ఫీలవుతున్నాడంటూ చెబుతూ ఫైనల్‌‌గా ఈ చిత్రానికి  ‘సింగిల్’ అనే టైటిల్‌‌ను అనౌన్స్ చేయడం క్యూరియాసిటీని కలిగించింది. శ్రీవిష్ణు స్టైలిష్ మేకోవర్ ఆకట్టుకుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్‌‌గా నటిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.