![#Single Glimpse: నాకు పెళ్లి కాకపోవడానికి ఆ నాకొడుకే కారణమంటున్న వెన్నెల కిషోర్.. ఏమైంది..?](https://static.v6velugu.com/uploads/2025/02/sree-vishnu-single-movie-glimpse-out_JY0WzRBCAH.jpg)
టైటిల్ చూసి ఇదేంటీ వెన్నెల కిషోర్ ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా... టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీ విష్ణు హాట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. గత ఏడాది స్వాగ్ సినిమాతో అలరించిన శ్రీవిష్ణు ఈసారి #సింగిల్ అంటూ మరోసారి ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు కి జంటగా లవ్ టుడే మూవ్ ఫేమ్ ఇవానా, కేతిక శర్మ నటిస్తుండగా ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ నటిస్తున్నాడు.
#సింగిల్ సినిమాకి తెలుగులో నిను వీడని నీడని నేను, నేను నా, అలాగే తమిళ్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కించిన కార్తీక్ రాజు స్టోరీతోపాటూ దర్శకత్వం వహిస్తుండగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ & కళ్యా ఫిల్మ్స్ బ్యానర్స్ పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప & రియాజ్ చౌదరి తదితర్లు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ సినీ సినిమాటోగ్రాఫర్ ఆర్. వేల్‌రాజ్ ISC సినిమాటోగ్రఫీ అందిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
సోమవారం ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. మొదటగా వెన్నెల కిషోర్ పార్క్ లో కూర్చుని ఉండగా బ్యాగ్రౌండ్ వాయిస్ తో హేయ్ నీకు ఇంకా పెళ్లి కాలేదా అనే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. వెన్నెల కిషోర్ ఏకంగా ముడ్డి కింద ముప్పై ఏళ్ళు వచ్చినా నాకు ఇంకా పెళ్లి కాకపోవడానికి కారణం ఆ నాకొడుకే అంటూ డైలాగ్ చెబుతాడు. శ్రీ విష్ణు ఎంట్రీ మొదలువుతుంది. ఐతే శ్రీవిష్ణు ప్రేమ సినిమాలో ఒంటరి వాడని నేను అనే పాట టేపురికార్డర్ లో ప్లే చేస్తూ పార్క్ లో నడుచుకుంటూ వస్తుంటాడు.
ఈ క్రమంలో పార్క్ లో లవర్స్ పై వంకాయ టపాసుల్ని పేల్చుతూ, లవ్ సింబల్ బెలూన్స్ ని పగలకొడుతూ సింగిల్ యువకుడి ఎంట్రీలో అదుర్స్ అనిపించాడు. ఆ తర్వాత హీరోయిన్స్ ని చూపిస్తూ టైటిల్ కార్డుతో ఎండ్ అవుతుంది. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో అలరించే శ్రీ విష్ణు ఈసారి సింగిల్ యువకుడి పాత్రలో అలరించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మాములుగా శ్రీ విష్ణు సినిమా స్టోరీ ఎలా ఉన్నప్పటికీ అయన యాక్టింగ్, కామెడీ టైమింగ్ కట్టిపడేస్తాయని చెప్పవచ్చు.