కూల్‌‌గా నవ్వించే శ్రీవిష్ణు సింగిల్ సినిమా.. మే 9న సినిమా విడుదల

కూల్‌‌గా నవ్వించే శ్రీవిష్ణు సింగిల్ సినిమా.. మే 9న సినిమా విడుదల

శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింగిల్’.  కేతిక శర్మ, ఇవాన హీరోయిన్స్‌‌. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌‌తో కలిసి  విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. మే 9న సినిమా విడుదల కానుంది. సోమవారం ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో హిలేరియస్‌‌గా సాగిన వీడియో సినిమాపై అంచనాలు పెంచింది.

ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నవ్వులు మామూలుగా ఉండవు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా థియేటర్స్‌‌లో ఎంజాయ్ చేసేలా ఉంటుంది.  సమ్మర్‌‌‌‌లో ఆడియెన్స్ అందరినీ చాలా కూల్‌‌గా ఉంచుతుంది’ అని అన్నారు.

శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ఇంటిల్లపాదిని కడుపుబ్బా నవ్వించాలని చేసిన సినిమా ఇది. వెన్నెల కిషోర్, కేతిక, ఇవాన .. ఇలా మంచి టీమ్ అంతా జాయిన్ అయిన తర్వాత ఇరగబడి నవ్వించాలనే ఉద్దేశం కాస్త కసిగా నవ్వించాలనంతగా తోడయ్యారు. ఆడియెన్స్  హ్యాపీగా నవ్వుకుంటారు పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. ఇదొక ఫన్ రైడ్ మూవీ అని హీరోయిన్స్ అన్నారు.

ఈ సినిమా తనకు ప్రౌడ్ మూమెంట్ అని కార్తీక్ రాజు చెప్పాడు. నవ్వించడమే టార్గెట్‌‌గా తీసిన సినిమా ఇదని నిర్మాతలు బన్నీ వాసు, విద్యా కొప్పినీడి, భాను  అన్నారు. నటుడు వెన్నెల కిషోర్,  మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ కూడా మాట్లాడారు.