
‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’ వంటి చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్నారు హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). ఇప్పుడు శ్రీవిష్ణు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో రాబోతున్నాడు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్లో రాబోతుంది.
ఇవాళ ఫిబ్రవరి 28న శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘మృత్యుంజయ్’ (Mrithyunjay) అంటూ ఆసక్తికరమైన టైటిల్తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి శ్రీ విష్ణు భారీ హైప్తో వస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే టీజర్ ఇంట్రెస్టింగ్గా సాగింది. బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని టీజర్ చూస్తే అర్ధమవుతోంది.
ఇక టీజర్ చివర్లో “నేను చెప్పే వరకు గేమ్ ఫినిష్ కాదు” అనే డైలాగ్‌తో శ్రీ విష్ణు క్యారెక్టర్ అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
Also Read:-జూలు విదిల్చిన సింహంలా మహేష్ బాబు కొత్త లుక్..
ఇందులో శ్రీ విష్ణుకి జంటగా రెబా జాన్ నటిస్తోంది. సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్ కలయికలో రాబోతున్న సినిమా కావడంతో ఆసక్తి కలిగిస్తోంది. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మనీషా.ఎ.దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇకపోతే, మృత్యుంజయ్ సినిమాను రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు.