SingleTrailer: ట్రైలర్ అదిరింది.. ‘సింగిల్‌‌’తో శ్రీ విష్ణు కామెడీ మంత్రం

SingleTrailer: ట్రైలర్ అదిరింది.. ‘సింగిల్‌‌’తో శ్రీ విష్ణు కామెడీ మంత్రం

శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సింగిల్‌‌’. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌‌. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 9న సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా నేడు (ఏప్రిల్ 28న) సింగిల్‌‌ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కామెడీ & లవ్ ఎంటర్టైనర్గా ట్రైలర్ సాగింది. ఇందులో శ్రీవిష్ణు స్టైలిష్ మేకోవర్ ఆకట్టుకుంది.

అమ్మాయిలను పడేయాలంటే మూడు దారులురా.. అందులో నెం.1. గుడ్ బాయ్స్. 2. బ్యాడ్ బాయ్ ఆటిట్యూడ్ చూపించడం, 3. మాస్ వాయిస్ అంటూ 3 షేడ్స్ తో శ్రీ విష్ణు కనిపించాడు. నువ్వు సింగిల్ హ అని హీరోయిన్ ఇవానా అడగ్గా.. ఐ యామ్ బర్న్ సింగిల్ అంటూ శ్రీ విష్ణు చెప్పడం క్యూట్ గా ఉంది. ఆ తర్వాత మరో హీరోయిన్ కేతిక ఎంట్రీతోనే కామెడీ క్రియేట్ చేసింది. దాంతో ఇద్దరి హీరోయిన్స్ మధ్య సాగే ట్రై యాంగిల్ లవ్ స్టోరీతో శ్రీ విష్ణు తన కామెడీ మంత్రాన్ని చూపించాడు. 

మొత్తానికి ఇలా 35 ఏళ్ల వయసులో కూడా తాను ఎందుకు ఒంటరిగా ఉన్నాడో అంటూ సాగిన ఈ హిలేరియస్‌‌ ట్రైలర్ బాగుంది. చుట్టూ ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నా కూడా ఇంకా ఒంటరిగానే ఫీలవుతున్నా ఓ హీరో కథే ఈ సింగిల్. ఈ క్రమంలోనే ‘ఒంటరి వాడిని నేను.. ఎవ్వరి వాడిని కాను’అనే థీమ్తో ట్రైలర్ సాగడం ఆసక్తిని పెంచింది. 

ఇకపోతే, డిఫరెంట్ స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు శ్రీవిష్ణు. ఇందులో భాగంగా ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’వంటి చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పడేలా కనిపిస్తోంది. ఇప్పటికే, రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.