సామజవరగమన, ఓం భీమ్ బుష్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఇటీవలే ‘స్వాగ్’ (Swag) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శ్రీవిష్ణుకి ‘రాజరాజచోర’ లాంటి బ్లాక్ బస్టర్‌ను ఇచ్చిన హసిత్ గోలి తెరకెక్కించిన ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇవాళ అక్టోబరు 25న ఓటీటీలో రిలీజైంది. నేడు శుక్రవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సడెన్ గా ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ కి షాకిచ్చింది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ.. అక్టోబర్ 4న థియేటర్లో రిలీజై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. అయితే, శ్రీవిష్ణుతో పాటు రీతూవర్మ నటనకు ప్రశంసలు దక్కాయి. ఐదు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకొచ్చి శ్రీ విష్ణు ఆకట్టుకున్నా కథనం కన్ఫ్యూజింగ్‌గా ఉండటంతో కాస్తా నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. కానీ, మిక్స్‌డ్ టాక్‌తో ఈ మాత్రం సంబంధం లేకుండా నిర్మాతలకు స్వాగ్ మూవీ లాభాలను తెచ్చిపెట్టినట్లు సినీ వర్గాల సమాచారం. ఇందులో రీతూ వర్మ హీరోయిన్. మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, సునీల్, గోపరాజు రమణ కీలకపాత్రలు పోషించారు.
కథేంటంటే:
1551వ సంవత్సరంలో కథ మొదలవుతుంది. మాతృస్వామ్య వ్యవస్థలో వింజామర వంశపు రాణి రుక్మిణీ దేవి (రీతూ వర్మ) పరిపాలనలో పురుషులు అణచివేతకు గురవుతుంటారు. భార్య ఆధిపత్యాన్ని తట్టుకోలేని ఆమె భర్త భవభూతి (శ్రీవిష్ణు).. ఓ పన్నాగం ద్వారా పురుషాధిక్యతను చాటి, తన శ్వాగణిక వంశం జెండాను ఎగుగవేస్తాడు. ఇకపై తన వంశంలో మగపిల్లలు ఉన్న వారికే ఆ రాజ్యపు ఖజానా దక్కాలనే శాపం పెడతాడు. ఆ నిధిని ఓ (గోపరాజు రమణ) వంశం తరతరాలుగా సంరక్షిస్తుంది.
ప్రస్తుత జెనరేషన్‌కు వస్తే.. ఎస్‌ఐగా రిటైర్ అయిన భవభూతి.. శ్వాగణికక వంశపు ఖజానాను దక్కించుకునేందుకు వరుస ప్రయత్నాలు చేస్తుంటాడు. మరోవైపు సోషల్ మీడియా వీడియోలు చేసుకునే సింగకు కూడా శ్వాగణిక వంశపు నిధి గురించి తెలుస్తుంది. పురుషాధిక్యతను సహించలేని అనుభూతి (రీతూ వర్మ) కూడా ఆ నిధి కోసం వస్తుంది. తమ ముందు తరానికి చెందిన యయాతి (శ్రీవిష్ణు) కారణంగానే ఈ నిధికి సంబంధించిన చైన్ లింక్‌కు బ్రేక్ పడిందని తెలుసుకుంటారు. మరి యయాతికి ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి? వీళ్లెలా అతనికి వారసులు అయ్యారు? వీళ్లకు ఉత్తరాలు రాసి నిధి విషయం తెలియజేసింది ఎవరు? ‘మైఖెల్ మదన కామరాజు’ లాంటి ఈ కథలో అసలైన రాజు ఎవరన్నదే మిగతా కథ.