శ్రీజ కొత్త చరిత్ర

శ్రీజ కొత్త చరిత్ర

హైదరాబాద్, వెలుగు: ఇండియా టేబుల్ టెన్నిస్ స్టార్, హైదరాబాదీ ఆకుల శ్రీజ చరిత్ర సృష్టించింది.  వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో  సింగిల్స్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ గెలిచిన తొలి ఇండియన్‌‌‌‌‌‌‌‌గా రికార్డుకెక్కింది. నైజీరియాలోని లాగోస్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈ టోర్నీలో  సింగిల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు డబుల్స్‌‌‌‌‌‌‌‌లోనూ విజేతగా డబుల్ ధమాకా మోగించింది. 

ఆదివారం జరిగిన విమెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో శ్రీజ 4–1తో చైనాకు చెందిన డింగ్ యిజీపై నెగ్గింది. డబుల్స్ తుది పోరులో అర్చన కామత్‌‌‌‌‌‌‌‌తో కలిసి 3–0తో ఇండియాకే చెందిన దియా చితాలె–యశస్విని గోర్పడేను ఓడించింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో హర్మీత్ దేశాయ్‌‌‌‌‌‌‌‌–మానవ్ ఠక్కర్ 3–0  తో  అజీజ్–ఒలడిజె (నైజీరియా)పై నెగ్గారు.