పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌కు.. ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శ్రీజ

పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌కు.. ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శ్రీజ

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాదీ ఆకుల శ్రీజ ఇండియా నుంచి టాప్ సీడెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగనుంది. శ్రీజ 16వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, మనిక బత్రా 18వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పోటీ పడనున్నారు. ఈ మేరకు  ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  మంగళవారం సీడింగ్స్ ప్రకటించింది. గత నెలలో కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్ 24వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకున్న శ్రీజ.. మనికను వెనక్కునెట్టి ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఇటీవల లాగోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన డబ్ల్యూటీటీ కంటెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో టైటిల్ నెగ్గి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. లెజెండరీ ప్యాడ్లర్ శరత్ కమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 24వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఐదోసారి ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరిలో దిగనున్నాడు. హర్మీత్ దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 49వ సీడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభించింది. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీటీ 14వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 11వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పోటీ పడనున్నాయి.