శ్రీజేష్ కు పద్మభూషణ్..అశ్విన్తో పాటు మరో ముగ్గురికి పద్మశ్రీ

శ్రీజేష్ కు పద్మభూషణ్..అశ్విన్తో పాటు మరో ముగ్గురికి పద్మశ్రీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ఐదుగురు క్రీడాకారులకు అవార్డులు లభించాయి. ఇండియా హాకీ లెజెండ్, మాజీ గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ దక్కింది. టోక్యో, పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా హాకీ జట్టు కాంస్య పతకాలు నెగ్గడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం శ్రీజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నాడు. 2014, 2022 ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గాడు. మూడుసార్లు (2020, 2022, 2024) ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు అందుకున్నాడు.  హాకీకి అతను చేసిన సేవలకుగాను ప్రభుత్వం 2015లో అర్జున, 2019లో పద్మ శ్రీ అవార్డులతో సత్కరించింది. 

ఇక మాజీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పారా ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్విందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సత్యపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మణి విజయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)కు పద్మ శ్రీ అవార్డులు వచ్చాయి. ఇటీవలే క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వీడ్కోలు పలికి అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2011 వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2013 చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ గెలిచిన ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సభ్యుడిగా ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 287 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడిన అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 765 వికెట్లు సాధించాడు.  హర్యానాలోని కథియాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్విందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పారాలింపిక్స్‌‌‌‌లో (పారిస్‌‌‌‌) గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచిన దేశ తొలి ఆర్చర్‌‌‌‌‌‌‌‌గా  నిలిచాడు. ఇండియా పారా అథ్లెటిక్స్‌‌లో అత్యంత కీలకమైన కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సత్యపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పేరుంది. 2012లో అతిపిన్న వయసులో ద్రోణాచార్య అవార్డును సొంతం చేసుకున్నాడు. పారా అథ్లెట్లను తీర్చిదిద్దడంలో సత్యపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిట్ట. ఇక మాజీ ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన మణి విజయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇండియా తరఫున 72 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 29 గోల్స్ కొట్టాడు. 2000 నుంచి 2004 వరకు ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేశాడు.