హీరో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ (Unstoppable with NBK,. ఇటీవలే సీజన్ 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఇప్పటికే, సీజన్ 4 లో ఏపీ సీఎం చంద్రబాబు, లక్కీ భాస్కర్ మూవీ టీమ్, సూర్య, అల్లు అర్జున్ వచ్చి ఆడియన్స్ను ఎంటర్ టైన్ చేశారు.
ఈ వారం లేటెస్ట్ ఎపిసోడ్ 6 కి చీఫ్ గెస్ట్ లుగా హ్యూమరస్ జాతిరత్నం హీరో నవీన్ పొలిశెట్టి, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల వచ్చి షో అదరగొట్టారు. తమదైన మాటలతో వీరిద్దరు బాలయ్యతో హంగామా చేశారు. బాలకృష్ణను ఉద్దేశిస్తూ.. 'సర్, మీరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే.. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్’ అంటూ సరికొత్త అర్థం చెప్పాడు నవీన్.
Also Read : రిలీజ్కు ముందే 'పుష్ప 2' నెలకొల్పిన రికార్డులు ఇవే
ఇక శ్రీలీల వీణ పట్టుకుని కూర్చోగా .. కుర్చీ మడతపెట్టి పాటను క్లాసికల్ స్టైల్‌లో ట్రై చేయమంటూ రాగమందుకున్నాడు నవీన్. ఇక అసలు చిప్స్ తిన్నోడికి సిక్స్‌ప్యాక్ ఎలా వస్తుంది సర్.. అంటూ నవ్వులు పూయించారు నవీన్. ఇక ప్రోమో చివర్లో ముగ్గురూ కలిసి కిస్సిక్ పాటకు స్టెప్పులు వేస్తూ అలరించారు. ఈ ఫన్‌ఫుల్ ఎపిసోడ్ శుక్రవారం డిసెంబర్ 6న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో రిలీజ్ కానుంది.