టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది శ్రీలీల.ఓవైపు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యువహీరోలకు జంటగానూ నటిస్తోంది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడు. శనివారం శ్రీలీల పాత్రను పరిచయం చేస్తూ తన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో ఆమె ‘చిత్ర’ అనే పాత్రను పోషిస్తోందని, ఇప్పటి వరకూ ఆమెపై తీసిన సీన్స్ అద్భుతంగా వచ్చాయని నిర్మాతలు తెలియజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శ్రీలీల క్యూట్‌గా కనిపించి ఆకట్టుకుంది. జోజు జార్జ్, అపర్ణా దాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.