గుంటూరు కారంలో శ్రీలీల లుక్ అదిరిపోయింది

గుంటూరు కారంలో శ్రీలీల లుక్ అదిరిపోయింది

మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో వస్తున్న ‘గుంటూరు కారం(Guntur kaaram)’ సినిమా నుండి శ్రీలీల(Sreeleela) ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. జూన్ 14న శ్రీలీల పుట్టినరోజు సంధర్బంగా ఈ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

ఈ లుక్ లో శ్రీలీల పట్టు పరికిణి వేసుకొని కాళ్లకు నైల్ పాలిష్ పెట్టుకుంటూ చాలా క్యూట్ గా కనిపించింది. ఈ పోస్టర్ చూసిన శ్రీలీల అభిమానులు ఫిదా అయిపోతున్నారు. శ్రీలీల చాలా క్యూట్ గా ఉంది అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంతేకాదు.. అభిమానులు, నెటిజన్లు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇక గుంటూరు కారం సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయినా గ్లింప్స్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మాస్ అవతార్ లో మహేష్ ఇరగదీశాడు. పూజాహెగ్డే(Pooja hegde), శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా.. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://twitter.com/haarikahassine/status/1668831459526979590